Telangana: తెలంగాణపై ఫోకస్‌ పెంచిన బీజేపీ.. హైదరాబాద్‌లో మకాం వేసిన అగ్ర నేతలు..

తెలంగాణలో ఎన్నికల కోసం బీజేపీ ప్రత్యేకంగా 14 కమిటీలు ఏర్పాటు చేసింది. అయితే ఇందులో కొన్ని కమిటీల పని దాదాపు ముగిసింది. మేనిఫెస్టో, చార్జీషీట్, స్క్రీనింగ్ కమిటీ బాధ్యతలు ఇప్పటికే పూర్తయ్యాయి. కాగా ఇప్పుడు సోషల్ మీడియా ఔట్ రీచ్, పబ్లిక్ మీటింగ్స్, ఇన్‌ఫ్లూయెన్సర్ ఔట్ రీచ్, అజిటేషన్, సోషల్ మీడియా, ఎలక్షన్ కమిషన్ ఇష్యూస్ ప్రధానంగా పనిచేయాల్సి ఉంది. ఇకపోతే మరికొన్ని కమిటీలు నామమాత్రంగా..

Telangana: తెలంగాణపై ఫోకస్‌ పెంచిన బీజేపీ.. హైదరాబాద్‌లో మకాం వేసిన అగ్ర నేతలు..
Bjp Ts

Edited By:

Updated on: Nov 26, 2023 | 1:46 PM

బీజేపీ అగ్ర నేతలంతా తెలంగాణలో తిష్ట వేశారు. సుడి గాలి పర్యటనలు చేస్తున్నారు. బహిరంగ సభలు, రోడ్ షో లతో హోరెత్తిస్తున్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా, యోగి అడిత్యనాత్ విస్తృతంగా పర్యటనలు చేస్తుంటే మరోవైపు బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ రాష్ట్ర కార్యాలయం నుంచే పర్యవేక్షణ చేస్తున్నారు. ఎన్నికల కోసం ఏర్పాటు చేసుకున్న ఆయా కమిటీలతో సమన్వయం చేసుకోవడంపై ఆయన ఫోకస్ పెట్టారు. ఎన్నికల కమిటీ పనితీరుపై రాష్ట్ర కార్యాలయం నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికల కోసం బీజేపీ ప్రత్యేకంగా 14 కమిటీలు ఏర్పాటు చేసింది. అయితే ఇందులో కొన్ని కమిటీల పని దాదాపు ముగిసింది. మేనిఫెస్టో, చార్జీషీట్, స్క్రీనింగ్ కమిటీ బాధ్యతలు ఇప్పటికే పూర్తయ్యాయి. కాగా ఇప్పుడు సోషల్ మీడియా ఔట్ రీచ్, పబ్లిక్ మీటింగ్స్, ఇన్‌ఫ్లూయెన్సర్ ఔట్ రీచ్, అజిటేషన్, సోషల్ మీడియా, ఎలక్షన్ కమిషన్ ఇష్యూస్ ప్రధానంగా పనిచేయాల్సి ఉంది. ఇకపోతే మరికొన్ని కమిటీలు నామమాత్రంగా మిగిలాయి. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ పనితీరు అంతంత మాత్రంగానే ఉంది.

ఎస్సీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిపై ఉన్నాయి. కానీ ఆయన పాలమూరుకే పరిమితమయ్యారు. తన తనయుడు ఆ స్థానం నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆ సెగ్మెంట్ దాటి బయటకు వెళ్లడం లేదు. ఎస్టీ రిజర్వ్ డ్ నియోజకవర్గాల సమన్వయ బాధ్యతలు మాజీ ఎంపీ గరికపాటి మోహన్ రావుపై ఉన్నాయి. ఆయన కూడా ఎన్నికల నేపథ్యంలో సైలెంట్ అయ్యారు.

ఎన్నికల్లో భాగంగా నేతలు ఆయా సెగ్మెంట్లకే పరిమితం కావడంతో బీఎల్ సంతోష్ రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఈ కమిటీలన్నింటి పనితీరును ఆయనే నేరుగా పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో బీజేపీకి సానుకూల పరిస్థితులు ఉన్నాయని వారికి పలు నివేదికలు అందడంతో పాటు పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీఎల్ సంతోష్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే ఆయన పలు అంశాలపై రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. ఎన్నికలకు మరో ఐదు రోజుల సమయమే ఉండటంతో బీజేపీ జాతీయ నాయకత్వం ఎలాంటి వ్యూహాలు అమలుచేస్తుందనేది అంతుచిక్కడం లేదు. ఇవి కమలం పార్టీకి ఎంత మేరకు కలిసొస్తాయనేది చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..