Telangana: విహారయాత్రకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన కుటుంబం.. ఆ ఇంటి గడియ తీసి ఉందని చూసి

అపార్ట్మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేసిన నేపాల్‌కు చెందిన అర్జున్‌పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. గత నెల 25న ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అర్జున్ అకస్మాత్తుగా ఉద్యోగాన్ని వదిలి అపార్ట్మెంట్‌ నుంచి వెళ్లిపోయాడు. ఈ కారణంగా అతని పాత్రపై పోలీసులు కూడా దృష్టి సారించారు.

Telangana: విహారయాత్రకు వెళ్లి ఇంటికి తిరిగొచ్చిన కుటుంబం.. ఆ ఇంటి గడియ తీసి ఉందని చూసి
Representative Image

Edited By:

Updated on: Dec 11, 2025 | 1:55 PM

మలక్‌పేట్‌లో నేపాలి గ్యాంగ్ కారణంగా మరో చోరీ ఘటన చోటు చేసుకుంది. మానస రెసిడెన్సీలో నివాసముంటున్న వెంకటరమణ కుటుంబం ఇటీవల విహారయాత్ర కోసం బయటకు వెళ్లి బుధవారం సాయంత్రం తిరిగి ఇంటికి చేరుకున్నారు. సుమారు 5:30 గంటలకు అపార్ట్మెంట్‌కు వచ్చిన వారు ప్రధాన తలుపు పగులగొట్టి ఉండటాన్ని గమనించి అనుమానంతో లోపలికి వెళ్లారు. వెంటనే బెడ్‌రూమ్‌లోకి వెళ్లిన వెంకటరమణ కుటుంబ సభ్యులు ఇంటిలో ఉన్న నగదు, బంగారం, వెండి ఆభరణాలు మొత్తం అదృశ్యమై ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ఇంటిలోని అల్మారాలు చెదరగొట్టి ఉండగా, దొంగలు సుమారు 45 లక్షల రూపాయల నగదు, 17 తులాల బంగారం, నాలుగు కిలోల వెండి ఆభరణాలను దోచుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే మలక్‌పేట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అపార్ట్మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేసిన నేపాల్‌కు చెందిన అర్జున్‌పై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. గత నెల 25న ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అర్జున్ అకస్మాత్తుగా ఉద్యోగాన్ని వదిలి అపార్ట్మెంట్‌ నుంచి వెళ్లిపోయాడు. ఈ కారణంగా అతని పాత్రపై పోలీసులు కూడా దృష్టి సారించారు. ప్రస్తుతం మలక్‌పేట్‌ పోలీసులు అపార్ట్మెంట్‌ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను సేకరిస్తూ, అర్జున్‌పై ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నారు. దొంగతనంలో అతనికి సంబంధం ఉందా? లేక మరెవరైనా ఈ ఘటన వెనుక ఉన్నారా? అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.

నగరంలో పెరుగుతున్న నేపాలి గ్యాంగ్ చోరీలపై ఇంటి ఓనర్లు అప్రమత్తంగా ఉండాలని పదేపదే పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అపార్ట్మెంట్‌లోని ఇతర సిబ్బంది, పొరుగువారిని కూడా ప్రశ్నిస్తున్నారు. అర్జున్ గతంలో ఎలాంటి ప్రవర్తన చూపాడో, అతనికి సహకరించే మరెవరైనా ఉన్నారో తెలుసుకునేందుకు విచారణ విస్తరించారు. దొంగతనం జరిగిన సమయానికి అపార్ట్మెంట్‌ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు తిరిగారా అన్న దానిపై కూడా పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు. త్వరలోనే సీసీటీవీ ఆధారాలు సాంకేతిక ఆధారంగా నిందితుని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us