Basara Temple: బాసర సరస్వతి అమ్మవారి భక్తులకు షాక్.. ఆర్జిత సేవల ధరలు పెంపు.. త్వరలో అమల్లోకి..

|

Oct 28, 2022 | 8:02 AM

అయితే బాసర సర్వతీదేవి భక్తులకు ఆలయాధికారులు షాక్ ఇచ్చారు. అమ్మవారి ఆర్జిత సేవల రేట్లను పెంచడానికి దేవాదాయ శాఖ ఆమోదం తెలిపింది. నూతన ఆర్జిత సేవల రేట్లు త్వరలో అమలు కానున్నాయని పేర్కొంది. 

Basara Temple: బాసర సరస్వతి అమ్మవారి భక్తులకు షాక్.. ఆర్జిత సేవల ధరలు పెంపు.. త్వరలో అమల్లోకి..
Basara Saraswathi Temple
Follow us on

గోదావరి నది ఒడ్డున ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం. ఈ ఆలయం నిర్మల్ జిల్లాలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రఖ్యాతి చెందింది. మనదేశంలో ఉన్న ప్రముఖ సరస్వతీ దేవాలయాల్లో ఒకటి కాశ్మీరులో ఉండగా, రెండవది బాసరలోని ఆలయంగా ప్రసిద్ధిగాంచింది. చాళుక్య కాలంలో నిర్మింపబడిన ఈ ఆలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. ఇక్కడ సరస్వతీ ఆలయంలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి తల్లిదండ్రులు అమితాసక్తిని చూపిస్తారు. త్రిదేవీ మూర్తులు వ్యాస ప్రతిష్ఠితం కనుక ఈ క్షేత్రం అక్షరాభ్యాసానికి పేరెన్నిక గన్నది. తల్లిదండ్రులు స్నేహితులు, బంధు మిత్రులతో ఈ క్షేత్రానికి వచ్చి తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తారు. ప్రముఖ తిథుల్లో పర్వదినాల్లో భక్తులు పోటెత్తుతారు. ఇక్కడ జరిపే అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుం ఉంటుంది. అయితే బాసర సర్వతీదేవి భక్తులకు ఆలయాధికారులు షాక్ ఇచ్చారు. అమ్మవారి ఆర్జిత సేవల రేట్లను పెంచడానికి దేవాదాయ శాఖ ఆమోదం తెలిపింది. నూతన ఆర్జిత సేవల రేట్లు త్వరలో అమలు కానున్నాయని పేర్కొంది.

పెంచిన ధరలు: 

అమ్మవారి అభిషేకము రూ. 200 నుండి రూ. 300 లకు పెంచింది.  సాధారణ అక్షరాభ్యాసం గతంలో రూ 100 లు ఉండగా ఇప్పుడు రూ.50 లను పెంచింది. దీంతో ఇక నుంచి సాధారణ అక్షరాభ్యాసం ధర రూ. 150లను చెల్లించాల్సి ఉంటుంది.  అమ్మవారి కుంకుమార్చన గతంలో రూ. 150 లు ఉండగా ఇక నుంచి రూ. 200 కుంకుమార్చన కోసం చెల్లించాల్సి ఉంటుంది. సత్యనారాయణ స్వామి పూజకు రూ. 100 నుండి రూ. 200లకు పెంచింది. ఇక నిత్య చండీ హోమానికి ఇప్పటి వరకూ రూ. 1116 ధర ఉండగా.. ఇక నుంచి నిత్య చండీ హోమానికి రూ.  1500లు చెల్లించాల్సి ఉంటుంది.  అమ్మవారి ఆలయంలో చిన్నారులకు అన్నప్రాసం కార్యక్రాన్ని నిర్వహించడానికి ఇప్పటి వరకూ రూ. 100 లు ఉండగా ఇక నుంచి రూ.150 లు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..