AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ముందస్తు ఎన్నికలు ఖాయమా? తెలంగాణలో కాక రేపుతున్న నేతల కామెంట్స్..

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై పార్టీల మధ్య తెగ చర్చ నడుస్తోంది. కేసీఆర్‌ ఎర్లీగా ఎన్నికలకు వెళతారా.. లేక రైట్‌ టైమ్‌కే వస్తారా అన్న అంశంపై రచ్చ రచ్చ జరుగుతోంది.

Telangana: ముందస్తు ఎన్నికలు ఖాయమా? తెలంగాణలో కాక రేపుతున్న నేతల కామెంట్స్..
Telangana Assembly
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 28, 2023 | 9:25 PM

తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై పార్టీల మధ్య తెగ చర్చ నడుస్తోంది. కేసీఆర్‌ ఎర్లీగా ఎన్నికలకు వెళతారా.. లేక రైట్‌ టైమ్‌కే వస్తారా అన్న అంశంపై రచ్చ రచ్చ జరుగుతోంది. ఇటీవల కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అనుమానం వ్యక్తం చేస్తే లేటెస్టుగా కేటీఆర్‌ ఫుల్‌ క్లారిటీ ఇచ్చారు. పైగా బాల్‌ కూడా బీజేపీ కోర్టులో వదిలారు. ముందస్తుపై బీఆర్ఎస్‌- బీజేపీ మద్య సవాళ్లలో కాంగ్రెస్ కూడా సై అంటోందా?

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది.. ఆన్‌ టైమ్‌కే వచ్చినా ఇంకా 8 నెలల సమయం మాత్రమే ఉంది. అతా కాదు ఇంకా ముందే వచ్చిన రావొచ్చు అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలపై ఒకటికి రెండుసార్ల క్లారిటీ ఇచ్చారు. ముందస్తుప్రసక్తే లేదు.. సమయానికే వస్తాయన్నారు.

అయినా ప్రత్యర్ది పార్టీలు ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నాయి. కేసీఆర్‌ మాటలకు ఆర్ధాలు వేరేలే అంటూ ముందస్తుకు సన్నద్ధమంటూ ప్రకటిస్తున్నాయి. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా పదేపదే ముందస్తు ఎన్నికలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్‌ ప్రభుత్వం ఇంకా ఉండేది మూడు నెలలే అంటూ రీసెంట్గా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన ప్రకటన ఊహాగానాలకు తెరతీసింది.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో ముందస్తు ఎన్నికల ప్రచారం బలంగా వినిపించడానికి కారణాలు కూడా చెబుతున్నాయి విపక్షాలు. అటు పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వేయడం.. ఇటీవల ఖమ్మంలో లక్షలమందితో సభ నిర్వహణ ఇవన్నీ కూడా ముందస్తుకు సన్నాహాలే అన్నది వారి అనుమానం. అయితే వీటికి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు కేటీఆర్‌. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దంగా ఉన్నాం కానీ పార్లమెంట్‌ను రద్దు చేసి ముందస్తుకు వస్తే.. తాము కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దమన్నారు మంత్ర కేటీఆర్‌. అంతే తమంతట తాము వెళ్లబోమని.. బీజేపీకి దమ్ముంటే కేంద్రంలో ప్రభుత్వం రద్దు చేసి వస్తే సిద్ధమని సవాల్‌ విసిరారు.

కర్నాటక ఎన్నికలతో పాటే తెలంగాణలో ఉంటాయని ప్రచారం జరిగినా బీఆర్ఎస్‌ మాత్రం ముందస్తు చర్చను లైట్‌గా తీసుకుంటోంది. ఆలోచనే లేదంటోంది. తాజాగా కేటీఆర్‌ సవాల్‌తో చెక్‌ పడినట్టేనా?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..