Telangana: అందుబాటులోకి వచ్చిన గురుకుల ఓటీఆర్..పోస్టుల కోసం ఈ నెల 17 నుంచి దరఖాస్తులు ప్రారంభం

తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టు భర్తీకి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌ బుధవారం అందుబాటులోకి వచ్చింది. గురుకులాల్లోని 9,231 పోస్టుల భర్తీ కోసం.. బోర్డు 9 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది.

Telangana: అందుబాటులోకి వచ్చిన గురుకుల ఓటీఆర్..పోస్టుల కోసం ఈ నెల 17 నుంచి దరఖాస్తులు ప్రారంభం
Teacher

Updated on: Apr 13, 2023 | 6:25 AM

తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో బోధన పోస్టు భర్తీకి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్‌ బుధవారం అందుబాటులోకి వచ్చింది. గురుకులాల్లోని 9,231 పోస్టుల భర్తీ కోసం.. బోర్డు 9 ఉద్యోగ ప్రకటనలు జారీ చేసింది. కేటగిరీల వారిగా పోస్టులకు ఈనెల 17 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓటీఆర్‌ నమోదు చేస్తేనే గురుకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. ఓటీఆర్‌ నమోదుకు సంబంధించిన వెబ్‌లింక్‌ను గురుకుల నియామక బోర్డు వెబ్‌సైట్లో అందిబాటులో ఉంచింది.

ఓటీఆర్‌ నమోదు కోసం మొదట ఆధార్‌ నంబరు నమోదు చేయాలి. ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు పూర్తిచేయాలి. అయితే రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం 1 నుంచి 7 వరకు చదివిన జిల్లాను నమోదు చేయాలి. అనంతరం ఓటీఆర్‌ పూర్తవుతుంది. తర్వాత నోటిఫికేషన్ల వారీగా అర్హత మేరకు దరఖాస్తు చేసేందుకు వీలు కలుగుతుంది. ఓటీఆర్‌ నమోదు తరువాత యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సహాయంతో లాగిన్‌ అయి.. అర్హత కలిగిన పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి. అనంతరం పరీక్ష ఫీజు చెల్లించి, మిగతా వివరాలు నమోదు చేస్తే దరఖాస్తు పూర్తవుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..