Ramakrishna Family Palvancha: తెలంగాణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసు సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడు వనమా రాఘవేందర్ రావు ఏ-2 నిందితుడిగా ఉన్నాడు. బాధిత కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ కారణమని.. రామకృష్ణ సూసైడ్ నోట్ రాయడంతో పాటు వీడియో కూడా రికార్డు చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అయింది. దీంతో పోలీసులు మూడు రోజుల తర్వాత శుక్రవారం రాత్రి పోలీసులు వనమా రాఘవను అరెస్టు చేశారు. అయితే.. కుటుబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డ నాగరామకృష్ణ రెండవ సెల్ఫీ వీడియో కూడా ప్రస్తుతం వైరల్‌గా మారింది. మోతుగూడెంలో రామకృష్ణ తండ్రి హెల్త్ ఇన్స్పెక్టర్‌గా విధులు నిర్వహించేవాడు. ఈ క్రమంలో 1992 లో నాగరామకృష్ణ తండ్రి నక్సల్స్ బాంబ్ బ్లాస్టింగ్ లో మృతి చెందాడు.
అయితే.. ఈ రెండో వీడియోలో మృతుడు నాగరామకృష్ణ మరిన్ని సంచలన విషయాలను వెల్లడించాడు. తాను చనిపోయే విషయం ప్రజలకు తెలియాలని పేర్కొన్నాడు. తనకు అప్పులు ఇచ్చిన వారికి న్యాయం జరగాలంటూ వీడియోలో వెల్లడించాడు. తాను ఆత్మహత్య చేసుకోవటానికి మొదటి పాత్రదారి, సూత్రధారి వనమా రాఘవ అంటూ పేర్కొన్నాడు. గత 20 సంవత్సరాల నుంచి తన అక్కతో వనమా రాఘవకు అక్రమ సంబంధం ఉందంటూ ఈ వీడియోలో ఆరోపించాడు. తన తండ్రి ద్వార తనకు సంక్రమించిన ఆస్థిని ఇవ్వకుండా అమ్మ, అక్క ఇబ్బంది పెడుతున్నారంటూ వెల్లడించాడు. సంవత్సర కాలంగా తనను అప్పుల ఊబిలో నెట్టారని పేర్కొన్నాడు.
కాగా.. ఈ వీడియో కూడా సంచలనంగా మారింది. ఇప్పటికే పోలీసులు వనమా రాఘవను అరెస్టు చేసి కొత్తగూడెం ఏసీపీ కార్యాలయంలో విచారిస్తున్నారు. కాగా.. వనమా రాఘవను శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు. భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మండలం మందలపల్లి, ఏపీ సరిహద్దు ప్రాంతం చింతలపూడి మధ్య రాఘవను అదుపులోకి తీసుకున్నారు.
Also Read:
Coffee Face Pack: కాఫీ పొడితో నిగనిగలాడే అందం మీ సొంతం.. ఇలా చేస్తే వెంటనే ఫలితం..