Telangana Congress: కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. రాజీనామాకు సిద్ధమైన మరో కీలక నేత..!

Telangana Congress: ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీలో జంపింగ్ జపాంగ్‌ల కలకలం రేగుతోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు..

Telangana Congress: కాంగ్రెస్‌ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. రాజీనామాకు సిద్ధమైన మరో కీలక నేత..!
Dasoju Sravan

Edited By:

Updated on: Aug 05, 2022 | 4:32 PM

Telangana Congress: ఢిల్లీ నుంచి గల్లీ వరకు కాంగ్రెస్ పార్టీలో జంపింగ్ జపాంగ్‌ల కలకలం రేగుతోంది. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. పార్టీని వీడేందుకు చాలా మంది సీనియర్ నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయగా.. తాజాగా మరో నేత కూడా పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రావణ్ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. మరికాసేపట్లోనే ఆయన మీడియా ముందుకు వచ్చి.. తన రాజీనామా వివరాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఆమె ఖైరతాబాద్ నుంచి పోటీ చేయాలని ఎప్పటి నుంచో భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ టికెట్ ఆశించి ఆ పార్టీలో చేశారు. అయితే, విజయారెడ్డి చేరికతో దాసోజ్ శ్రవణ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆమె రాక వల్ల తన కెరీర్‌కు నష్టం కలుగుతుందని భావించిన శ్రవణ్ పార్టీని వీడాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దాసోజు శ్రవణ్ పార్టీని వీడుతారనే వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు అలర్ట్ అయ్యారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కిసాన్ కాంగ్రెస్ నేత కోదండ రెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ యాదవ్ లు.. దాసోజు శ్రవణ్‌ను కలిసి చర్చించేందుకు బంజారాహిల్స్‌లోని ఆయన కార్యాలయానికి బయలుదేరారు. పార్టీ మారకుండా చూసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..