Telangana: తెలంగాణ ఫారెస్ట్‌లో మరో భారీ పులి సంచారం.. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు

|

Aug 13, 2022 | 7:16 AM

Telangana: తెలంగాణ ఫారెస్ట్‌లోనూ పులి సంచారం వణుకుపుట్టిస్తోంది. మారు మూల అటవీ ప్రాంతంలోని గిరిజనులను గజ గజలాడిస్తోంది. బావుల దగ్గరికి వెళ్లాలంటేనే రైతులు బోరుమంటున్నారు...

Telangana: తెలంగాణ ఫారెస్ట్‌లో మరో భారీ పులి సంచారం.. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు
Tiger
Follow us on

Telangana: తెలంగాణ ఫారెస్ట్‌లోనూ పులి సంచారం వణుకుపుట్టిస్తోంది. మారు మూల అటవీ ప్రాంతంలోని గిరిజనులను గజ గజలాడిస్తోంది. బావుల దగ్గరికి వెళ్లాలంటేనే రైతులు బోరుమంటున్నారు. మారు మూల అటవి ప్రాంతాల్లో పులల భయం వణుకు పుట్టిస్తోంది. ఏదో మూలన.. ఏదో చోట పులి సంచారం ఉందంటూ జోరుగా పుకార్లు సికార్లు చేస్తున్నాయి. దీంతో అటవి ప్రాంతాల్లో ఉన్న బావుల దగ్గరికి సాయంత్రం, తెల్లవారు జామును వెళ్లాలంటేనే రైతులు భయపడిపోతున్నారు. ఎటు నుంచి ఎటు వచ్చి పులులు దాడి చేస్తాయోనని ఆందోళన చెందుతున్నారు. ఈ మధ్య వరుసగా వస్తున్న పులుల సంచారం వార్తలు రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బావుల దగ్గర ఉన్న పశువులపై దాడి చేసి చంపేస్తున్నాయి. తాజాగా.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలం బొగ్గుల వాగు ప్రాజెక్టు ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అడవుల్లో మేత కోసం సంచరించే పశువుల కాపర్ల కంట పడినట్టు తెలుస్తోంది. అంతే కాకుండా.. అటవీ ప్రాంతంలో పులి పాద ముద్రలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన పశువుల కాపరులు.. స్థానిక సర్పంచ్‌ సాయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్‌ అధికారులు బొగ్గుల వాగు పరిసరాల్లో పాద ముద్రలను పరిశీలించారు. వీటిని చూసిన ఫారెస్ట్‌ సిబ్బంది.. భారీ కాయంతో ఉన్న పులి ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు గుర్తించారు. ముందు జాగ్రత్త చర్యగా మారుమూల అటవీ ప్రాంతంలో సంచరించరాదని రైతులను హెచ్చరిస్తున్నారు

ఫారెస్ట్‌ అధికారులు. మరో ఆమారు పాద ముద్రలను పరిశీలించి పులిపై క్లారిటీకి వస్తామంటున్నారు అధికారులు. కొద్ది రోజుల క్రితం కూడా ఇదే ప్రాంతంలో పులి కనిపించినట్టు పశువుల కాపరులు అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే.. ఆ పులి ఆనవాళ్లు ఏ మాత్రం కనిపించక పోవడంతో వెనుదిరిగి వెళ్లి పోయారు. ఈ మారు మాత్రం పులి జాడలు కనిపిస్తున్నాయని.. తరుచు ఈ ప్రాంతంలో పులి తిరుగుతోందని గుర్తించారు. ఇవ్వడంతో పాద ముద్రలు పరిశీలిస్తున్న అటవీశాఖ అధికారులు. అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి