AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలులో నిద్రపోయే వారికి గుడ్‌న్యూస్‌.. రైల్వే ప్రత్యేక సర్వీసు.. స్టేషన్‌కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు..

Indian Railways: రైలులో ప్రయాణించే ప్రయాణికుల కోసం రైల్వే నిరంతరం తన సేవలను మెరుగుపరుస్తుంది. కొత్త అప్‌డేట్‌లను ప్రవేశపెడుతోంది. ఇదిలా ఉంటే రైల్వేశాఖ ప్రయాణికులకు..

Indian Railways: రైలులో నిద్రపోయే వారికి గుడ్‌న్యూస్‌.. రైల్వే ప్రత్యేక సర్వీసు.. స్టేషన్‌కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు..
Indian Railways
Subhash Goud
|

Updated on: Aug 12, 2022 | 6:03 PM

Share

Indian Railways: రైలులో ప్రయాణించే ప్రయాణికుల కోసం రైల్వే నిరంతరం తన సేవలను మెరుగుపరుస్తుంది. కొత్త అప్‌డేట్‌లను ప్రవేశపెడుతోంది. ఇదిలా ఉంటే రైల్వేశాఖ ప్రయాణికులకు ఓ శుభవార్త ప్రకటించింది. సాధారణంగా రైళ్లలో నిద్రపోవడం అనేది సహజం. రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు త్వరగా నిద్ర వస్తుంది. ఎందుకంటే రైలు పట్టాలపై నడుస్తున్నకొద్ది మనిషి రిలాక్స్‌ అవుతాడు. దీంతో చాలా మంది నిద్రలోకి జారుకుంటారు. ఇంక దూర ప్రయాణం చేసేవారు ఎంచక్క నిద్రపోతారు. ఈ నేపథ్యంలో ఇలాంటి నిద్రపోయే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌ తెలిపింది. రైలులో నిద్రపోతే దిగే స్టేషన్‌ మిస్సవుతుందనే బెంగ ఉండదు. స్టేషన్ మిస్సవుతుందనే చింత లేకుండా హాయిగా నిద్రపోవచ్చు. మీరు స్టేషన్‌కు చేరుకోవడానికి 20 నిమిషాల ముందు రైల్వే మిమ్మల్ని నిద్రలేపుతుంది. దీంతో మీ స్టేషన్ మిస్ కాకుండా మీరు సులభంగా విశ్రాంతి తీసుకోగలుగుతారు.

రైల్వే ఈ ప్రత్యేక సేవ పేరు ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’. చాలా సార్లు ప్రజలు రైలులో నిద్రపోతారు. దీంతో వారు స్టేషణ్‌ను మిస్సయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు రైల్వే ఈ సౌకర్యం ప్రారంభించింది. రైల్వే ఈ సదుపాయాన్ని 139 నంబర్ ఎంక్వైరీ సర్వీస్‌లో ప్రారంభించింది. రైలులో ప్రయాణించే ప్రయాణికులు విచారణ వ్యవస్థ నంబర్ 139లో అలర్ట్ సౌకర్యం కోసం అడగవచ్చు.

స్టేషన్ చేరుకోవడానికి 20 నిమిషాల ముందు అలర్ట్ వస్తుంది. మీరు కూడా ఈ సేవను సద్వినియోగం చేసుకోవాలనుకుంటే రాత్రి 11 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు ఈ సౌకర్యం ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇందుకోసం రైల్వేశాఖ కేవలం రూ.3 ఫీజుగా నిర్ణయించింది. మీరు ఈ సేవను పొందాలనుకుంటే మీ స్టేషన్‌కు 20 నిమిషాల ముందు మీ ఫోన్‌కి అలర్ట్ పంపబడుతుంది. తద్వారా మీరు మీ సామాను మొదలైనవాటిని సరిగ్గా ఉంచుకోవచ్చు. మీరు స్టేషన్‌కు రాగానే రైలు దిగండి.

ఇవి కూడా చదవండి

సేవను పొందాలంటే ఏం చేయాలి..?

☛ ‘డెస్టినేషన్ అలర్ట్ వేకప్ అలారం’ సేవను ప్రారంభించడానికి, మీరు IRCTC హెల్ప్‌లైన్ 139కి కాల్ చేయాలి.

☛ కాల్ స్వీకరించినప్పుడు మీ భాషను ఎంచుకోండి.

☛ గమ్యస్థానం కోసం, ముందుగా నంబర్ 7ని ఆపై నంబర్ 2ని నొక్కండి.

☛ దీని తర్వాత ప్రయాణికుల నుండి 10 అంకెల PNR నంబర్ అడుగుతుంది.

☛ PNRని నమోదు చేసిన తర్వాత నిర్ధారించడానికి 1కి డయల్ చేయండి.

☛ ఈ ప్రక్రియ తర్వాత, సిస్టమ్ PNR నంబర్‌ను ధృవీకరించండి. అలాగే వేక్అప్ హెచ్చరికను అందించండి.

☛ దీని నిర్ధారణ SMS ప్రయాణికుడి మొబైల్‌కు అందుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
ఆలుగడ్డలు ఎక్కువ కాలం తాజా ఉండాలా? ఈ సులభమైన చిట్కాలు పాటించండి!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
భార్యను స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేసిన భర్త..!
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
బిగ్ బాస్‌లో డబ్బులిచ్చారు కానీ నా జీవితంతో ఆడుకున్నారు
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
శనివారం వెంకటేశ్వర స్వామి దీపారాధన.. ఒక్కసారి చేసేయండి, డబ్బు..
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
ఎయిర్ ఇండియా చేసిన పనికి వెనక్కి వచ్చిన విమానం!
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
సిలిండర్‌ 14.2 కేజీలే ఎందుకు ఉంటుంది? 15 కేజీలు ఎందుకు ఉండదు?
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
భారతదేశంలో ఎప్పటికీ ఫెయిల్యూర్ కాని 5 టాప్ బిజినెస్ ఐడియాలివే!
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
గ్లోబల్ సైజుకు తీసుకెళదామనుకున్న సినమాకు గుర్తింపు లేదా?
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
బ్యాడ్ కొలెస్ట్రాల్ కు చెక్.. గుండెపోటు రాకుండా 5 సూపర్ టిప్స్
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!
ఉగాది రోజున ఇల్లు శుభ్రం చేస్తుండగా ఘోరం..!