OPPO K9x: మరో సంచలనానికి తెర తీసిన ఒప్పో.. రూ. 15 వేలకే 50 ఇంచుల స్మార్ట్‌ టీవీ.. ఫీచర్లు చూస్తే..

OPPO K9x: చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్‌ దిగ్గజం ఒప్పో తాజాగా కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది. 50 ఇంచెస్‌ స్క్రీన్‌తో కూడిన ఈ ఫోన్‌ను తక్కువ బడ్జెట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.

Narender Vaitla

|

Updated on: Aug 12, 2022 | 8:03 PM

 ప్రస్తుతం స్మార్ట్‌ టీవీల హవా కొనసాగుతోంది. కంపెనీల మధ్య పెరిగిన పోటీ కారణంగా తక్కువ ధరకే స్మార్ట్‌ టీవీలను అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనా దిగ్గజ సంస్థ ఒప్పో కొత్త స్మార్ట్‌ టీవీని లాంచ్‌ చేసింది.

1 / 5
Oppp k9x పేరుతో చైనాలో లాంచ్‌ చేసిన ఈ స్మార్ట్‌ టీవీ ధర చైనా కరెన్సీలో 1399 యువాన్‌లుగా ఉంది. అంటే మన కరెన్సీలో రూ. 16,500గా ఉంది. అయితే లాంచ్‌ ఆఫర్‌లో భాగంగా 1299 యూవాన్లకు అందిస్తోంది. భారత కరెన్సీలో రూ. 15,350కే. త్వరలోనే ఈ టీవీని భారత మార్కెట్లోకి లాంచ్‌ చేయనున్నారు. మన దేశంలో ధర ఎలా ఉంటుందో త్వరలోనే తెలియనుంది.

2 / 5
 ఇక ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఎల్‌ఈడీ-బ్యాక్‌లిట్ ప్యానెల్‌తో కూడి 50 ఇంచెస్‌ స్క్రీన్‌ను అందించారు. 4కే రిజల్యూషన్‌తో ఈ టీవీ స్క్రీన్‌ పనిచేస్తుంది. కళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు సరికొత్త టెక్నాలజీని వినియోగించారు.

3 / 5
ఒప్పో సొంతంగా తయారు చేసిన ఏఐ పీక్యూ అల్గారిథమ్‌ను అందించారు. 280 నిట్‌ల వరకు టీవీ బ్రైట్‌నెస్‌ను పెంచుకోవచ్చు. 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌ ఈ స్మార్ట్‌ టీవీ సొంతం.

4 / 5
ఈ స్మార్ట్‌ టీవీలో క్వాడ్ కోర్‌ మీడియా టెక్‌ చిప్‌సెట్‌ను అందించారు. మూడు హెచ్‌డీఎమ్‌ఐ పోర్ట్‌లు, ఈథర్నెట్ పోర్ట్‌ను ఇచ్చారు. 20w వపర్‌ రేటింగ్‌తో కూడన రెండు ఇంటిగ్రేటెడ్‌ స్పీకర్‌లను అందించారు.

5 / 5
Follow us