Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారు

Amit Shah Hyderabad Tour: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో విడత ప్రజా సంగ్రమ ..

Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా తెలంగాణ పర్యటన ఖరారు

Updated on: May 12, 2022 | 5:33 PM

Amit Shah Hyderabad Tour: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా హైదరాబాద్‌ పర్యటన ఖరారైంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో విడత ప్రజా సంగ్రమ (Praja Sangrama Yatra) యాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈనెల 14న హైదరాబాద్‌కు రానున్న అమిత్‌ షా.. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట విమానాశ్రయింలో దిగనున్నారు. 3 గంటలకు సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబరేటరీని సందర్శించి సాయంత్రం 4.30 గంటల వరకు ఉండనున్నారు. అలాగే 5 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులోని నోవా టెల్‌ హోటల్‌కు వెళ్లనున్నారు. 6.30 గంటలకు హైదరాబాద్‌ సమీపంలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో అమిత్‌ షా హాజరై ప్రసంగించనున్నారు. అనంతరం రాత్రి 8 గంటలకు సభ స్థలి నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చి రాత్రి 8.25 గంటలకు ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు. కాగా, అమిత్‌ షా పర్యటన ఖరారు కావడంతో సభకు భారీ సంఖ్యలో ప్రజలను సమీకరించడంలో బీజేపీ నిమగ్నమైంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి