Telangana: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ATA ప్రతినిధులు.. తెలుగు మహా సభలకు రావాలంటూ ఆహ్వానం..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ATA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఏడాది జూలై 31న జరగనున్న 19వ ఆటా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం తో అమెరికాలో ఉన్న తెలుగు ప్రవాసుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఆటా మహాసభలకు రావాలని కోరారు.

Telangana: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ATA ప్రతినిధులు.. తెలుగు మహా సభలకు రావాలంటూ ఆహ్వానం..!
American Telugu Association Invites Cm Revanth Reddy

Updated on: Dec 18, 2025 | 11:44 PM

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెరికా తెలుగు అసోసియేషన్‌ (ATA) ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. వచ్చే ఏడాది జూలై 31న జరగనున్న 19వ ఆటా మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం తో అమెరికాలో ఉన్న తెలుగు ప్రవాసుల భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ఆటా మహాసభలకు రావాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో ATA ప్రెసిడెంట్ జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ప్రతినిధులు ఉన్నారు. ఈ సందర్భంగా 19వ మహాసభల లక్ష్యాలు, కార్యక్రమాల రూపురేఖలను ముఖ్యమంత్రికి వివరించారు.

యువత భాగస్వామ్యం, వ్యాపార అవకాశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణలుగా ఉంటాయని అటా ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆటా ప్రతినిధులతో మాట్లాడిన సీఎం, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో ఆటా కీలక పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ప్రవాస భారతీయులు, ముఖ్యంగా తెలుగు వాసులు రాష్ట్ర అభివృద్ధికి అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. విద్య, ఐటీ, పెట్టుబడులు, సాంస్కృతిక మార్పిడిలో ఆటా వేదికగా నిలుస్తోందని అన్నారు. అలాగే ఈ మహాసభలు తెలుగు ఐక్యతను ప్రపంచస్థాయిలో చాటేలా నిర్వహించేందుకు తమ సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.