
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో మరో వివాదం తెరపైకి వచ్చింది. ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్‌తో కొందరికి అవకాశాలు ఇస్తుందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. టాలెంట్ ఉన్నవాళ్లను HCAలోని కొందరు తొక్కేస్తున్నారంటూ ఏకంగా రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ను వరుస వివాదాలు వెంటాడున్నాయి. కొత్తగా HCAతో పాటు పలువురు ప్లేయర్సపై అనంత్ రెడ్డి అనే వ్యక్తి రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. అండర్ 16, అండర్ 19, అండర్ 23 లీగ్ మ్యాచుల్లో పలువురు ప్లేయర్ల ఫేక్ బాగోతం నడిచిందని కంప్లైంట్ ఇచ్చారు. ఆయా విభాగాల్లో స్థానం పొందేందుకు పలువురు ప్లేయర్లు నకిలీ బర్త్ సర్టిఫికెట్లు సమర్పించారని తెలిపారు. HCA నిర్లక్ష్యంతో ఎక్కువ వయసు ఉన్న ప్లేయర్లు లీగ్‌లో ఎంట్రీ ఇస్తున్నారని అనంత్‌రెడ్డి ఆరోపించారు.
గతంలో ఆరుగురు ప్లేయర్స్‌ను గుర్తించి బీసీసీఐ బ్యాన్ విధించిందని అనంత్ రెడ్డి గుర్తు చేశారు. ఎక్కువ వయసు ఉన్నప్పటికీ తక్కువ ఏజ్ లీగ్‌లో అడేలా HCA అవకాశమిస్తోందని ఆరోపించారు. గతంలో ఫేక్ సర్టిఫికెట్లు అని పోలీసులు తేల్చినవాళ్లు కూడా ఈ ఏడాది ఎలా రీఎంట్రీ ఇస్తున్నారని ప్రశ్నించారు. టాలెంట్ ఉన్న ప్లేయర్లకు నష్టం జరిగేలా HCA వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అవినీతికి పాల్పడి, టాలెంట్ లేని ప్లేయర్లను వివిధ లీగ్ మ్యాచ్‌లలో ఆడిస్తున్న హెచ్‌సీఏ అధికారులపై చర్యలు తీసుకోవాలని అనంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి విచారణ కోసం ఉప్పల్ పీఎస్‌కు వెళ్లిన అనంతరెడ్డి..హెచ్‌సీఏలో ఫేక్ అండ్ డబుల్ బర్త్ సర్టిఫికెట్లను అరికట్టాలని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మొత్తంగా.. ఇప్పటికే.. వివిధ అంశాల్లో HCA అవినీతికి పాల్పడిన తీరు.. తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇప్పుడు.. మళ్లీ ఫేక్ బర్త్ సర్టిఫికెట్స్ ఆరోపణలతో HCA మరో వివాదంలో చిక్కుకుంటుంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..