Telangana: వీళ్లు మామూలోళ్లు కాదు..! కుటుంబ సభ్యులంతా ముఠా సభ్యులే.. ఏం చేశారో తెలుసా?

ఈజీ మనీ కోసం అందరూ ఆశ పడుతుంటారు.. కానీ ఓ కుటుంబం మాత్రం ఏకంగా ముఠాగా ఏర్పడ్డారు. ఇంకేముంది రైతుల వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లే లక్ష్యంగా కాపర్ వైరును దొంగిలిస్తోంది ఈ ముఠా.

Telangana: వీళ్లు మామూలోళ్లు కాదు..! కుటుంబ సభ్యులంతా ముఠా సభ్యులే.. ఏం చేశారో తెలుసా?
Nalgonda Police
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Aug 08, 2024 | 3:55 PM

ఈజీ మనీ కోసం అందరూ ఆశ పడుతుంటారు.. కానీ ఓ కుటుంబం మాత్రం ఏకంగా ముఠాగా ఏర్పడ్డారు. ఇంకేముంది రైతుల వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లే లక్ష్యంగా కాపర్ వైరును దొంగిలిస్తోంది ఈ ముఠా. రెండేళ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ట్రాన్స్‌‌ఫార్మర్ల కాపర్ వైరును దొంగిలిస్తున్న ఈ ముఠాను నల్లగొండ పోలీసులు కటకటాల పాలు చేశారు.

ఏపీలోని పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు మెగవత్ రంగా నాయక్, జటావత్ ఇమామ్ నాయక్, జటావత్ మౌలాన నాయక్, షేక్ జటావత్ వలీ నాయక్, కేతవత్ సునిల్ కుటుంబ సభ్యులు. ఈజీ మనీ కోసం అలవాటు పడిన ఈ కుటుంబం ముఠాగా ఏర్పడ్డారు. ఇందుకోసం వ్యవసాయ పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న వ్యవసాయ ట్రాన్స్ ఫార్మర్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ కాయిల్స్, ఆయిల్ ను దొంగిలించి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా హైదరాబాద్ లోని పాత ఇనుము షాప్ లలో విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

రెండేళ్లుగా నల్గొండ జిల్లాలోని వాడపల్లి, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, త్రిపురారం, నిడమానూర్, తిప్పర్తి, నల్గొండ, నకిరేకల్, చిట్యాల పోలీస్ స్టేషన్ ట్రాన్స్ ఫార్మర్లను దొంగిలిస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ ముఠాలోని ఐదుగురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 9 లక్షల రూపాయల నగదు, కారు, నాలుగు సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. పరారీలో ఉన్న ఇద్దరిని కూడా పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..