AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఆ ఊరంతా నాగాలే.. గ్రామం పేరే నాగుల పేట.. చరిత్ర తెలిస్తే స్టన్..

ఆ ఊర్లో ఎవరిని పిలిచినా వారి పేర్లలో నా అనే అక్షరం ముందు ఉంటుంది. నాగరాజు.. నాగరాణి..లాంటి పేర్లు ఆ ఊర్లో అందరికీ ఉంటాయి..అవును అది నిజమండోయ్ నమ్మలేకపోతున్నారు.. ఇది నిజం. నాగ దేవత కీ ఇక్కడ ప్రత్యేక మైన పూజలు చేస్తారు.. ఒక్కసారి ఈ గ్రామం గురించి తెలుసుకుందాం.

Telangana: ఆ ఊరంతా నాగాలే.. గ్రామం పేరే నాగుల పేట.. చరిత్ర తెలిస్తే స్టన్..
Telangana
G Sampath Kumar
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 01, 2025 | 7:50 PM

Share

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో నాగులపేట అనే గ్రామం ఉంటుంది. ఇక్కడ దాదాపు 3,000 జనాభా ఉంటుంది. ఇక్కడ స్వయంభుగా వెలసిన నాగులమ్మ దేవాలయం ఉంది. ఆ ఊరి పేరు నాగులపేట. దీంతో ఇక్కడ ప్రతి ఒక్కరు ఈ నాగ దేవతను ఇష్టంగా పూజిస్తారు. ఇలవేల్పుగా భావిస్తారు. దీంతో ప్రతి ఒక్కరికి ఈ ఊర్లో నాగదేవత పేరు వచ్చే విధంగా పెడుతున్నారు. అబ్బాయిలకు నాగరాజు అని.. అమ్మాయిలకు నాగమణి, నాగలక్ష్మి వచ్చే విధంగా పెడుతున్నారు.

ఈ నాగలయంతో తమ గ్రామం చల్లగా ఉందని.. ఆ దేవత మహిమతోనే బాగుంటున్నామని నమ్మకంగా చెబుతున్నారు. దీంతో అమ్మవారి.. నా అనే అక్షరంతో పేర్లు పెట్టారు. ఇప్పటికీ ‘నా’ అనే అక్షరంతో నామకరణం చేస్తున్నారు. ఆ ఊర్లో ఏ పని మొదలు పెట్టాలన్నా ఆ ఊరి గ్రామ దేవతైన నాగులమ్మ దేవాలయంలో పూజల తర్వాతే మొదలు పెడుతారు. ఈ ఊర్లో పుట్టిన ప్రతి ఒక్క బాబుకి, పాపకి మొట్టమొదటగా ‘నా’ అనే అక్షరంతోనే పిల్చుకుని పేర్లు పెట్టుకుంటారు. ఈరోజు తామందరూ సుఖ సంతోషాలతో, పాడిపంటలతో హాయిగా ఉన్నామంటే ఆ గ్రామ దేవత నాగులమ్మ దీవెనలేనని స్థానికుల నమ్మకం.

నాగులమ్మ దేవాలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. కోరుకున్న కోరికలను తీర్చే దేవత అని పేరుంది. సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని నమ్మకం. స్థానికులతో పాటు పక్కన ఉన్న జిల్లాల వారు చాలామంది వచ్చి ముడుపులు కట్టుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో ఎప్పుడూ సందడి ఉంటుంది. ఇక్కడ ప్రతివారి పేర్లు.. ‘నా’తోనే మొదలవుతున్నాయి. ఒక్క గ్రామంలో ఇన్ని పేర్లు ఉండటం చాలా అరుదు. ఇక్కడ నాగుల పంచమి, నాగుల చవితి రోజు.. భక్తుల రద్ధీ అధికంగా ఉంటుంది. ప్రత్యేకమైన వేడుకలు నిర్వహిస్తారు. ఒక్కరిని నాగరాజు అని పిలిస్తే.. ఓ పదిమంది చూస్తారు. నాగరాణి అని పిలిస్తే.. మరో పదిమంది అమ్మాయిలు చూస్తారు. అప్పుడప్పుడు ఈ పేర్లతో అయోమయానికి గురవుతున్నారు స్థానికులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి