అక్షయ తృతీయ పేరుతో ఘరానా మోసం..రూ. 10కోట్లు మోసం చేసి పారిపోయిన వ్యాపారి

ఒక ఆభరణాల వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ మోసగించిన బంగారం వ్యాపారి ఇటీవలే హోల్‌సేల్ బిజినెస్ ప్రారంభించాడని, అతని కుటుంబం ornamental stones వ్యాపారంలో పేరొందినదని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపోతున్నారు పోలీసులు.. ప్రస్తుతం బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం అని పోలీసుకు చెబుతున్నారు.

అక్షయ తృతీయ పేరుతో ఘరానా మోసం..రూ. 10కోట్లు మోసం చేసి పారిపోయిన వ్యాపారి
Akshaya Tritiya Gold Scam

Edited By:

Updated on: May 01, 2025 | 2:20 PM

అక్షయ తృతీయ పేరుతో బంగారాన్ని తక్కువ ధరకే ఇస్తానంటూ ఓ బంగారం వ్యాపారి సుమారు ₹10 కోట్ల మేర ఖాతాదారులను మోసగించాడు. బుధవారం రోజున వ్యాపారి షాపు మూతపడడం, అతని ఆచూకీ తెలియకపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఇటీవల బంగారం ధర ఒక్క తులాకు రూ.1 లక్షకు చేరడంతో పాత ధరకే బంగారం కొనే ఆసక్తితో కొంతమంది అతనికి అడ్వాన్స్‌ ఇచ్చారు. అర్మూర్ ప్రాంతంలోWholesale బంగారం వ్యాపారిగా పేరున్న ఈ వ్యక్తి గత నెల రోజులుగా నగదు సేకరిస్తున్నాడు. అతనికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ టీచర్లు, ఇతర వ్యాపారులు పెద్ద ఎత్తున అడ్వాన్స్‌లు ఇచ్చినట్లు సమాచారం.

చివరి నాలుగు రోజులుగా అతని ఫోన్‌ స్విచ్‌ఆఫ్‌ అయి ఉండగా, అతని నివాసానికి వెళ్లిన కొంతమంది అతని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా, వ్యాపారి తండ్రి ప్రైవేట్ హాస్పిటల్‌లో “ఆరోగ్య అత్యవసర పరిస్థితి”తో అడ్మిట్ అయినట్లు సమాచారం. ఒక ఆభరణాల వ్యాపారి తెలిపిన వివరాల ప్రకారం, ఈ మోసగించిన బంగారం వ్యాపారి ఇటీవలే హోల్‌సేల్ బిజినెస్ ప్రారంభించాడని, అతని కుటుంబం ornamental stones వ్యాపారంలో పేరొందినదని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపోతున్నారు పోలీసులు.. ప్రస్తుతం బాధితులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటాం అని పోలీసుకు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..