Congress: కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం.. కలహాలకు స్వస్థి పలకాలంటూ..

కాంగ్రెస్‌లో కలహాలకు స్వస్థి పలకాలన్నారు తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్. సీనియర్లు, జూనియర్లు కలిసి పనిచేయాలన్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఆ వివరాలు ఈ స్టోరీలో ఓ సారి చూసేద్దాం మరి. లేట్ ఎందుకు లుక్కేయండి ఇలా..

Congress: కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ దిశానిర్దేశం.. కలహాలకు స్వస్థి పలకాలంటూ..
Aicc Secretary Meenakshi Natarajan

Updated on: Jun 23, 2025 | 9:30 PM

జై బాపు, జై భీమ్‌, జై సంవిధాన్‌ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఏఐసీసీ ఇంఛార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ నేతలకు దిశానిర్దేశం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అధ్యక్షతన నిర్వహించిన జై బాపు, జైభీమ్‌, జై సంవిధాన్‌ కో ఆర్డినేటర్ల సమావేశంలో మీనాక్షి పాల్గొన్నారు. రాజ్యాంగ పరిరక్షణకు జై సంవిధాన్‌ కార్యక్రమంపై అవగాహన పెంచాలన్నారు మీనాక్షి నటరాజన్. త్వరలో తాను ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటిస్తానన్నారు మీనాక్షి నటరాజన్. కార్యకర్తలతో సమావేశమవుతామన్నారు. కాంగ్రెస్ నేతలంతా ప్రజలతో మమేకమవ్వాని పిలుపునిచ్చారామె. ప్రతి నాయకుడు గ్రామబాట పట్టాలన్నారు. గ్రామంలో నిద్రించి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు. ఉదయం గ్రామాల్లో శుభ్రత- పరిశుభ్రత కార్యక్రమం పాల్గొనాలన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలంటే గ్రామస్థాయిలో కాంగ్రెస్‌ బలంగా ఉండాలన్నారు. గ్రామస్థాయిలో సమస్యల పరిష్కారంపై ఫోకస్ చేయాలన్నారు. తాగునీరు, డ్రైనేజీ సహా స్థానిక సమస్యలకు మోక్షం కలిగించాలన్నారు మీనాక్షి. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత నాయకులపై ఉందన్నారు మీనాక్షి నటరాజన్‌. కాంగ్రెస్ కార్యక్రమాల్లో గ్రూప్ తగాదాలకు తావుండొద్దన్నారామె. సీనియర్లు, జూనియర్లు సమన్వయంతో కలిసి పనిచేస్తేనే మంచి ఫలితాలు వస్తాయన్నారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి