Telugu News Telangana AICC Appointed manikrao thakre new incharge telangana congress party
Telangana: తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇన్‌ఛార్జ్.. మాణిక్యం ఠాగూర్ తొలగింపునకు ఆ విమర్శలే కారణమా..
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్ రావు థాక్రేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా..
Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల కొత్త ఇన్‌ఛార్జ్‌గా మాణిక్ రావు థాక్రేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నియమించింది. ఇప్పటి వరకు తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న మాణిక్యం ఠాగూర్‌ను గోవా ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. మాణిక్‌రావు థాక్రేను తెలంగాణకు నియమించింది. మహారాష్ట్రకు చెందిన మాణిక్‌రావు థాక్రే గతంలో మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జిని మారుస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా మాణిక్యం ఠాగూర్ వ్యవహరశైలిపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇదే విషయాన్ని ఇటీవల రాష్ట్రానికి వచ్చిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్‌కు చెప్పినట్లు తెలిసింది. మరోవైపు బుధవారం జరిగిన పరిణామాలు మాణిక్యం ఠాగూర్‌ను తెలంగాణ బాధ్యతల నుంచి తప్పించి వేరేవారికి అప్పగిస్తారనే ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంకాలం తెలంగాణకు కొత్త ఇన్‌ఛార్జిగా మాణిక్ రావు థాక్రేను కాంగ్రెస్ పార్టీ నియమించింది.
Congress appoints Manikrao Thakre as AICC in-charge of Telangana and Manickam Tagore as in-charge of Goa. pic.twitter.com/LzTdSYHF3K