టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ప్రపంచం ముందుకు సాగుతున్నా ఇంకా మూఢనమ్మకాలు ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయి. క్షుద్ర పూజల పేరుతో సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా.. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సాత్ నంబర్ గ్రామంలో శుక్ర వారం క్షుద్ర పూజలు కలకలం సృష్టించాయి.
గ్రామానికి చెందిన బిక్కు నాయక్ పంట పొలం లోని సమాధి వద్ద క్షుద్రపూజల ఆనవాళ్లు ఉండడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పసుపు, కుంకుమ, జీడి గింజలు, ఎర్రటి వస్త్రాలు, కర్ర బొమ్మ, మంత్ర తంత్రాలతో చేసిన ఆనవాళ్ళు కనిపించడంతో గ్రామస్తులు భయాందోళనలకు గురవుతున్నారు. సాయంత్రం ఏడు గంటల తరువాత బయటకు వెళ్లేందుకు జంకుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు సమావేశమయ్యారు. ఎవరు చేసి ఉంటారు..? పోకిరీలు చేసి ఉంటారా అంటూ భావించారు. దీనిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..