R Narayana Murthy: ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయడంలో సినిమాల పాత్ర కీలకం.. చట్టాలపై నటుడు ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు

|

Aug 19, 2021 | 10:07 PM

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ఒకే దేశం, ఒకే మార్కెట్‌ వల్ల

R Narayana Murthy: ప్రజల్ని చైతన్య వంతుల్ని చేయడంలో సినిమాల పాత్ర కీలకం.. చట్టాలపై నటుడు ఆర్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
R Narayana Murthy
Follow us on

R Narayana Murthy: నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి అన్నారు. ఒకే దేశం, ఒకే మార్కెట్‌ వల్ల రైతుకు లాభాలు ఉండవని ఆయన చెప్పారు. నూతన చట్టాలు కార్పొరేట్‌ సంస్థలకు మేలు చేసవిగా ఉన్నాయన్న ఆయన, చట్టాలు అమలుతో మార్కెట్‌ పతనం కావడం, రైతులకు సరైన ధర లభించడం లేదన్నారు.

2006లో బీహార్‌లో వ్యవసాయ మార్కెట్లను ఎత్తివేయడంతో అక్కడి రైతులు కూలీలుగా మారారని నారాయణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. మార్కెట్‌లో ప్రతి వస్తువు విక్రయించే వారే ధర నిర్ణయిస్తారని, పంటలకు మాత్రం రైతు ఎందుకు ధర నిర్ణయించకూడదని ఆయన ప్రశ్నించారు. దేశంలో సామాజికంగా వెనుకబడిన కులమంటే అది రైతు కులమే అని ఆయన చెప్పారు.

2006 సంవత్సరానికి ముందు దేశంలో సుమారు మూడున్నర లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ సమయంలో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఆత్మహత్య?ను ఆపేందుకు స్వామినాథన్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసిందని నారాయణ మూర్తి తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలపై మంత్రి గుంటకండ్ల జగదీషరెడ్డితో కలిసి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సినీ నటుడు ఆర్‌.నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. సినిమాలు ప్రజలను చైతన్య పర్చడంతోపాటు ప్రజాఉద్యమాలను బలోపేతం చేసేందుకు దోహద పడుతున్నాయని నారాయణ మూర్తి చెప్పారు.

Read also: Ramya Murder: రమ్య హత్య వంటి ఘటనలు పునరావృతం కాకుండా వినూత్న చర్చలు : మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌