టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా శ్రీనివాస్‌ను చేరుస్తూ సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ ప్రత్యేక కోర్టు కొట్టేసింది. దాంతో ఈ కేసు నుంచి ఆయనకు ఊరట లభించినట్లయింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం బయటపడినప్పటి నుంచి ఎన్నో మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకొక ట్విస్ట్ చేసుకుంటోంది. ఇప్పటికే బీఎల్ సంతోష్, తుషార్ ల విచారణపై కోర్టు స్టే విధించగా.. ఇప్పుడు సిట్ అధికారులు శ్రీనివాస్‌పై దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో పీసీ యాక్ట్, ఎన్‌బిఎస్‌పి యాక్ట్ ప్రకారం అడ్డక డబ్బు దొరకలేదని, ఘటనా సమయంలో నిందితులు అక్కడ లేరని, పోలీసులు వారిని నిందితులుగా భావిస్తూ మెమో దాఖలు చేయడం ఏవి ధంగా సరైంది కాదని ఏసీబీ కోర్టు అభిప్రాయపడింది. ఈ అభిప్రాయంతోనే సిట్ దాఖలు చేసిన మెమోను కొట్టేసింది కోర్టు.