మే 17 నుంచి టెన్త్‌ పరీక్షలు.. అకడమిక్‌ షెడ్యూల్‌ ఖరారు చేసిన తెలంగాణ పాఠశాల విద్యా శాఖ

| Edited By: Rajeev Rayala

Jan 22, 2021 | 6:07 AM

మే 17 నుంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పాఠశాల విద్యా శాఖ అకడమిక్‌ షెడ్యూల్‌ ఖరారు చేసింది. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా ప్లాన్...

మే 17 నుంచి టెన్త్‌ పరీక్షలు.. అకడమిక్‌ షెడ్యూల్‌ ఖరారు చేసిన తెలంగాణ పాఠశాల విద్యా శాఖ
Follow us on

New Academic Calendar : మే 17 నుంచి టెన్త్‌ పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ పాఠశాల విద్యా శాఖ అకడమిక్‌ షెడ్యూల్‌ ఖరారు చేసింది. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేసింది. కోవిడ్ కారణంగా 11 ప్రశ్నపత్రా లకు బదులు ఈసారి 6 ప్రశ్నపత్రాలతోనే పరీక్షలను నిర్వహించనుంది.

ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10 తరగతులకు ప్రత్యక్ష విద్యా బోధనను ప్రారం భించనున్నందున.. పని దినాలు, బోధన, పరీక్ష లకు సంబంధించిన షెడ్యూల్‌ తదితర అం శాలతో ప్రతిపాదిత క్యాలెండర్‌ను తెలంగాణ సర్కార్‌ ఆమోదం కోసం పంపించింది. ప్రభుత్వం ఒకటి, రెండు రోజుల్లో ఆమోద ముద్ర వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే ఇందులో 9, 10 తరగతులకు మాత్రమే అకడమిక్‌ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. మిగతా తరగతుల విషయాన్ని ప్రస్తా వించలేదు. ఆయా తరగతులకు ప్రత్యక్ష బోధన నిర్వహిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ 1 నుంచి 8 తరగతు లకు ప్రత్యక్ష బోధన కుదరకపోతే ఆన్‌లైన్‌/ డిజిటల్‌ విధానంలోనే బోధనను కొనసాగించి, విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్‌ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ అంశాలన్నింటిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.