Hyderabad: పాతబస్తీలో ఆకతాయిల ఆగడాలు.. ఓ యువతి ఏం చేసిందో తెలుసా..?

హైదరాబాద్‌ పాతబస్తీలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలను వేధిస్తున్నారు. రోడ్డుపైనే దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు.

Hyderabad: పాతబస్తీలో ఆకతాయిల ఆగడాలు.. ఓ యువతి ఏం చేసిందో తెలుసా..?
Hyderabad Crime
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 18, 2024 | 10:00 AM

హైదరాబాద్‌ పాతబస్తీలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. యువతులు, మహిళలను వేధిస్తున్నారు. రోడ్డుపైనే దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో యువకులు అనాగరికంగా వ్యవహర్తిస్తున్నారు. మహిళలు, యువతులు, విద్యార్థినుల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. అందరూ చూస్తుండగానే అమ్మాయిలపై దాడులు చేస్తున్నారు.

వీకెండ్‌లో సరదా కోసం పాతబస్తీకి వెళ్లిన యువతిని కొందరు యువకులు అటకాయించారు. వేధింపులకు పాల్పడ్డారు. ఆమెపై దాడి చేశారు. అయితే ఆ యువతి మాత్రం ఆకతాయిల బెదిరింపులకు భయపడకుండా వారి చేష్టలను వీడియో తీసింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వీడియో ఫుటేజ్‌ ఆధారంగా యువతి శాలిబండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆకతాయిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాతబస్తీలో యువకులు హద్దు మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..