
హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరోసారి వాన ముంచెత్తింది. దాంతో మూసీ నదికి వరద పోటెత్తింది. దిగువన ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. యాదాద్రి జిల్లాలో మూసీ నది అనుబంధంగా ఉన్న వాగులు ఉదృతిగా ప్రవహిస్తుండడంతో లో లెవెల్ బ్రిడ్జిలపై వరద ఉదృతంగా నీరు ప్రవహిస్తుంది. ప్రయాణం ప్రమాదంగా మారింది.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు వద్ద చిన్నేటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రోడ్డుపై వరద ప్రవాహం పెరిగింది. ఓ 80 ఏళ్ల వృద్ధురాలు వరదను అంచనా వేసుకుంటూ.. వరద ఉదృతిని తట్టుకుని వాగు ప్రవాహాన్ని దాటింది. ఆమె వెనకాలే 23 ఏళ్ల యువకుడు వరద ఉధృతిని దాటే ప్రయత్నం చేశాడు. సునాయాసంగా ఆమె వాగును దాటి వెళ్లగా.. అతడు మాత్రం వరద అంచనా వేయలేక బలైపోయాడు. వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. ఇదంతా అక్కడ అందరూ చూస్తుండగానే జరిగిపోయింది.
వీడియో చూడండి..
కళ్ళ ముందే యువకుడు కొట్టుకు పోతుంటే…కాపాడే సాహసం కూడా చేయలేక పోయారు స్థానికులు. దాంతో యువకుడు గల్లంతై పోయాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. బాధితుడు హైద్రాబాద్ లోని నాచారం కు చెందిన గుండె నరేష్ గా గుర్తించారు. గల్లంతైన నరేష్ కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..