Bhadradri Kothagudem: దారితప్పి జనావాసాల్లోకి వచ్చిన అడవి జంతువు.. జనాలు సెల్ఫీల కోసం ఎగబడగా..
మానవులు తమ మనుగడ కోసం భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నారు. పట్టణాభివృద్ధి పేరుతో అడవులను నరుకుతూ పచ్చదనం లేకుండా చేస్తున్నారు. ఈ క్రమంలో అడవుల్లో ఉండాల్సిన జంతువులు , వన్య ప్రాణులు, పక్షులు నిలువనీడ లేక తరచూ జనావాసాల మధ్యలోకి వస్తున్నాయి. ఇలానే భద్రాద్రి జిల్లాలోకి వచ్చిన ఓ మచ్చల దుప్పితో జనాలు సెల్ఫీలు తీసుకునేందుకు ఎడబడగా అదిపారిపోయింది.

ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీతో పాటు కాలుష్యం కూడా పెరుగుతూనే ఉంది. పట్టణాభివృద్ధి పేరుతో చెట్లను నరుకుతూ పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. దీంతో గాలిలో ఆక్సిజన్ శాతం తగ్గి ప్రజలకు ముప్పుగా మారుతుంది. మరోవైపు భవననిర్మాణాల కోసం అడవులు నరకడంతో అభయారన్యంలో ఉండే మూగజీవులకు నిలువనీడ లేక జనావాసాల్లోకి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే టనే భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంటుంది. దీనిపై ఆధారపడి గిరిజనులు ,ఆదివాసీలు ,గుత్తికోయలు జీవనం సాగిస్తూ ఉంటారు. ఇక ఈ జిల్లాలోని అడవి సమీప ప్రాంతాలైన సత్తుపల్లి ,అశ్వారావుపేటలో అటవీ జంతువులు ఆహారం, నీళ్ళు కోసం వెతుక్కుంటూ దారి తప్పి తరచూ జనావాసాల మధ్యలోకి వస్తుంటాయి. ఇలానే అశ్వారావుపేట పట్టణంలో ఓ చుక్కల దుప్పి ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన జనాలు పట్టుకోవడానికి ప్రయత్నించారు. దానితో సెల్ఫీలు దిగేందుకు వెంట పడ్డారు.
వీడియో చూడండి..
దీంతో భయపడిపోయిన చుక్కల దుప్పి వారిని పట్టణం మొత్తం పరిగెత్తించింది. ఈ విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు దానికేదైన ప్రమాదం జరుగుతుందేమోనని గ్రహించి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అది వాళ్లకు చిక్కకుండా అల్లిగూడెం అటవీ ప్రాంతానికి వెళ్లింది. దీంతో ఫారెస్ట్ సిబ్బంది దుప్పిని అటునుంచటే అడవిలోకి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
