మనిషి జీవితంలో ఒక్కసారి ఏదైనా కలిసి వచ్చింది అంటే…కలిసి వచ్చిన నెంబర్‌ను, కలిసి వచ్చిన ప్రాంతాన్ని, వాహనాలను వదులుకోరు. మీ అదృష్ట సంఖ్య ఇది అని అన్నారే అనుకోండి. వాడే మొబైల్ నెంబర్ నుండి మొదలుకుంటే వాహనాల నంబర్ల వరకు ఆ సంఖ్య ఉండాల్సిందే. ఆ సంఖ్య లేకపోతే అది నెంబర్ ఏ కాదు అని భావించే వాళ్ళు ఎందరో. ప్రస్తుతం ఫ్యాన్సీ నంబర్ల జోరు నగరంలో విపరీతంగా పెరిగింది. ఏ వాహనం కొన్న తమ అదృష్ట సంఖ్య ఉందా లేదా అని చూసుకుంటున్నారు. లేకపోతే మరి సెంటిమెంట్‌గా భావించే వ్యక్తులు మాత్రం ఆ నెంబర్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. ఈ మధ్య కాలంలో వాహనాల కొనుగోలు చేయడం విపరీతంగాపెరిగిపోయింది. కార్లను కొనుగోలు లక్షల పెట్టి కొంటే తాము అదృష్టంగా భావించే నెంబర్లను సైతం లక్షల రూపాయలను పెట్టి కొంటున్నారు. ముఖ్యంగా 9999,7777,0001..ఇలా ఉన్న నెంబర్ ప్లేట్‌కు డిమాండ్ ఎక్కువ గానే ఉంటుంది.
లక్కీ నెంబర్‌గా భావించే కొందరు ఆ నెంబర్ రాకుంటే నిరాశ పడుతుంటారు. దింతో RTA అధికారులు ఫాన్సీ నంబర్లను వేలం వేసే ప్రక్రియ తీసుకొని వచ్చారు.. అధికారులు పెట్టిన ఫాన్సీ నెంబర్ కావాలి అనుకుంటే ఆ వేలం లో పాల్గొని మీ లక్కీ నెంబర్ ను కొనుగోలు చేసుకోవచ్చు. తాజాగా ఖైరతాబాద్ RTA నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో 18 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.TS11EZ9999 ను 9,99,999 కు చర్చ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కొనుగోలు చేసింది. TS11FA0001 ను 3 లక్షల రూపాయాలకు కామినేని సాయి శివనాగ్ కొనుగోలు చేసాడు. ఇలా కార్ల కొనుగోలు కన్నా తమ ఫాన్సీ నంబర్ల ను సైతం లక్షల రూపాయలు కొంటున్నారు…ఎంత బడ్జెట్ పెట్టి కారు కొన్న దానికి తగ్గ నెంబర్ లేకపోతే ఎలా అని భావిస్తున్నారు లక్కీ నెంబర్ ప్రేమికులు.
అంతేకాదు గతంలో పలువులు సెలబ్రిటీలో కూడా ఫ్యాన్సీ నంబర్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టి మరీ తమకు కావాల్సిన నెంబర్ ప్లేట్‌ను పెట్టించుకున్నారు. చాలామందికి ఇలా ఫ్యాన్సీ నంబర్లపై మక్కువ ఉంటుంది. ఎప్పుడైన కొత్త సిమ్ తీసుకుంటే కూడా చాలామంది ఫ్యాన్సీ నంబర్ తీసుకోవాలని భావిస్తారు. అందుకోసం ఒక షాపులో తమకు కావాల్సిన నెంబర్ దొరకకపోతే.. మళ్లీ మరో షాప్‌కైనా వెళ్తారు. ఎలాగైనా తమకు కావాల్సిన నెంబర్ వచ్చేవరకు అలా వెతుకుంతుంటారు ఫ్యాన్సీ నెంబర్ ప్రియులు. అలాగే అలాంటి ప్యాన్సీ నెంబర్ ప్రియులే తమ వాహనాల నెంబర్లపై కూడా ఆసక్తి చూపుతుంటారు. అయితే వాహనాలకు ఈ ఫ్యాన్సీ నెంబర్లు తీసుకోవాలంటే మాత్రం డబ్బులు ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే డబ్బున్నవాళ్లు మాత్రం తమకు కావాల్సిన నెంబర్ కోసం ఎంతైన ఖర్చు చేసేందుకు వెనుకాడరు.