Telangana: రోడ్డు కోసం ఓ వ్యక్తి వినూత్న నిరసన.. విద్యార్థులు, టీచర్లు బడికి వెళ్లకుండా ముళ్ల కంచె అడ్డువేశాడు..

|

Aug 27, 2022 | 8:34 AM

నిరసన వ్యక్తం చేయాలంటే ప్రజాప్రతినిధులను, అధికారులను అడగాలి.. కానీ, ఇలా చేయటం సబబుకాదని చెప్పారు.

Telangana: రోడ్డు కోసం ఓ వ్యక్తి వినూత్న నిరసన.. విద్యార్థులు, టీచర్లు బడికి వెళ్లకుండా ముళ్ల కంచె అడ్డువేశాడు..
Khammam
Follow us on

Telangana: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సామ్య తండాలో పాఠశాల విద్యార్థులకు వింత పరిస్థితి ఎదురైంది. తమ వీధికి రోడ్డు వేస్తామని ప్రజాప్రతినిధులు ఇచ్చిన హామీతో గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి స్కూల్ కు గతంలో మూడు గుంటల స్థలం ఇచ్చారు. రాజు అనే వ్యక్తి కుటుంబ పెద్దలు. స్థలం అయితే, తీసుకున్నారు గానీ, రాజు పూర్వీకుల కాలం నుంచి ఈనాటి వరకు ప్రజాప్రతినిధులు ఇచ్చిన మాట నెరవేర్చకపోవడంతో ఆగ్రహం చెందిన రాజు వినూత్న రీతిలో నిరసన చేపట్టాడు. విద్యార్థులు, టీచర్లు స్కూల్‌కి రాకుండా రోడ్డుపై అడ్డుగా కంప వేశాడు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన మాట మేరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ నిరసన తెలిపాడు. దాంతో స్కూల్‌ వెళ్లేందుకు విద్యార్థులు, టీచర్లు ఇబ్బందిపడ్డారు.

నిరసన వ్యక్తం చేయాంటే ప్రభుత్వ కార్యాలయాల ముందు, ప్రజాప్రతినిధులను అడ్డుకోవాలి అన్నారు. అంతేగానీ, విద్యార్థులను, టీచర్లను ఇబ్బంది పెట్టడమేంటని స్టూడెంట్స్ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆరోపించారు. ఇలా మూడు రోజులుగా తమను అడ్డుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ప్రజాప్రతినిధులు విద్యార్థుల తల్లిదండ్రులు కంచె వేసిన రాజుతో మాట్లాడారు. నిరసన వ్యక్తం చేయాలంటే ప్రజాప్రతినిధులను, అధికారులను అడగాలి.. కానీ, ఇలా చేయటం సబబుకాదని చెప్పారు. ఇలా ఉపాధ్యాయులను విద్యార్థులను అడ్డుకోవడం తగదని వారు సూచించారు.

అయితే రాజు నిరసనపై విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. త్వరలోనే మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పడంతో ఆందోళన విరమించాడు రాజు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి