డబ్బులు ఇవ్వకుంటే బ్యాంకును పేల్చేస్తానంటూ భయపెట్టాడు.. చివరికి

|

May 20, 2023 | 4:33 AM

హైదరాబాద్ జీడిమెట్లలలోని షాపూర్‌నగర్‌ ఆదర్శ్‌ బ్యాంక్‌ దగ్గర డమ్మీ బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుంది. శరీరం మొత్తానికి బాంబు తరహా సెటప్‌ చేసుకొని ఓ వ్యక్తి హల్‌ చల్‌ చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గురువారం రోజున ఓ వ్యక్తి సాధారణంగానే బ్యాంకులోకి ప్రవేశించాడు.

డబ్బులు ఇవ్వకుంటే బ్యాంకును పేల్చేస్తానంటూ భయపెట్టాడు.. చివరికి
money
Follow us on

హైదరాబాద్ జీడిమెట్లలలోని షాపూర్‌నగర్‌ ఆదర్శ్‌ బ్యాంక్‌ దగ్గర డమ్మీ బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుంది. శరీరం మొత్తానికి బాంబు తరహా సెటప్‌ చేసుకొని ఓ వ్యక్తి హల్‌ చల్‌ చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గురువారం రోజున ఓ వ్యక్తి సాధారణంగానే బ్యాంకులోకి ప్రవేశించాడు. అయితే ఒక్కసారిగా తన దగ్గరు బాంబు ఉందంటూ అందరిని బెదిరించసాగాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని లేకుంటే బ్యాంకు మొత్తం పేల్చేస్తానంటూ బెదిరించాడు. దీంతో అక్కడున్న బ్యాంకు సిబ్బంది, వినియోగదారులు భయబ్రాంతులకు గురయ్యారు.

అయితే ఈ వ్యవహారంపై జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్నారు. చివరికి అతని బాడిపై ఉన్నదాన్ని డమ్మి బాంబుగా తేల్చేశారు. ఆ వ్యక్తిని జీడిమెట్లకు చెందిన శివాజిగా గుర్తించిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే అతను ఎందుకు అలా చేశాడనే దానిపై విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..