తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో ముందుగా ఈవీఎంలు మొరాయించినప్పటికీ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన పోలింగ్ 7.78 శాతంగా తెలిపారు ఎన్నికల అధికారులు. కొన్ని జిల్లాల్లో 10శాతం దాటినప్పటికీ మరి కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా పోలింగ్ ప్రక్రియ సాగుతోంది. ఇందులో ఉదయాన్నే పలువురు సినీ రాజకీయ ప్రముఖులతో పాటూ మహిళలు, యువత పాల్గొన్నారు. వీరితో పాటూ ముఖ్యంగా వృద్దులు ఓటేసేందుకు సుముఖత చూపడం చాలా మందికి స్పూర్తినిస్తోంది.
నిర్మల్‌లో ఒక పోలింగ్ కేంద్రంలో 100 ఏళ్ల వృద్దురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నడుములు ఒంగినప్పటికీ మూడు కాళ్ల ముసలవ్వ ఓపికగా నడుచుకుంటూ వచ్చి ఓటు వేయడం యావత్ రాష్ట్రానికే స్పూర్తిగా నిలిచింది. ఈమె పేరు మనోహర అని తాను చదువుకున్నట్లు చెప్పారు. ఓటు హక్కు వినియోగించుకునే వారికి నమస్కారాలు తెలిపారు. గెలిచిన నాయకులు తమకు మంచిగా చూసుకోవాలని వివరించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.
పోలింగ్ లైవ్ అప్‌డేట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
తెలంగాణ పోలింగ్ కవరేజ్ కోసం..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..