ఉదయాన్నే నిద్ర లేచింది.. తలంటు స్నానం చేసి కొత్త డ్రెస్ వేసుకొని తన పుట్టిన రోజు ను అందరికీ తెలుపుతూ నిండు నూరేళ్ళు జీవించాలని పొద్దున్నే తన తాత వద్ద ఆశీస్సులు తీసుకుంది. స్కూల్ బస్ లో స్కూల్ కు వెళ్లి అందరికీ సంతోషంగా చాక్లెట్స్ పంచి దీవెనలు అందుకుంది ఆ చిన్నారి. పాపం ఆ చిన్నారికి తెలియదు పుట్టిన రోజునే.. తనకు ఆఖరు రోజు అవుతుందని ఊహించలేదు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లేందుకు తాతయ్య బైకు మీద బయల్దేరారు. అంతే మార్గ మధ్యలో చెట్టు కొమ్మ విరిగి యమపాషమై ఆ చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంటుందని ఊహించలేదు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కాలకూరి లిఖిత సంతోషి (12) అనే చిన్నారికి చిన్న తనంలోనే తన తండ్రి అశోక్ చనిపోయాడు. తల్లి జ్యోత్స్న హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటుంది. అయితే చిన్నారి లిఖిత సంతోషిని తన తాతయ్య పూర్ణ చంద్రరావు వద్దే చదువుకుంటుంది. తండ్రి లేని లోటును తాతయ్య తీర్చుతూ అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తున్నారు. శుక్రవారం రోజు ఆ చిన్నారి పుట్టిన రోజు కావడంతో సంతోషంగా స్కూల్ వెళ్లి వాళ్ళ స్కూల్‌లో పిల్లలకు టీచర్స్‌కు చాక్లెట్స్ పంచి ఆశీస్సులు తీసుకుంది. తిరిగి ఇంటికి వెళ్లేందుకు తన తాతయ్యతో బైకు మీద వెళ్తుండగా తాల్లమడ గ్రామం వద్ద హైవే రోడ్డు పక్కన ఉన్న చెట్టు కొమ్మ విరిగి చిన్నారి తలపై పడింది. చిన్నారి తలకు తీవ్ర గాయం అయ్యింది. దాంతో అక్కడిక్కడే స్పృహతప్పి పడిపోయారు.
కళ్ళ ముందే తన మనువరాలు విగతజీవిగా పడి పోవడంతో ఆ తాత ఎలాగైనా చిన్నారి ప్రాణాలు దక్కించుకోవాలని ఖమ్మం కిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం దక్కలేదు. ఇంతకు ముందే మామయ్య.. అత్తయ్య.. అన్నయ్య.. అక్క.. అని ఆప్యాయతతో పిలుస్తూ పుట్టిన రోజు అంటూ గెంతులు వేస్తూ తిరిగిన చిన్నారి లిఖిత సడెన్ గా ఈ లోకం వదిలి వెళ్లిందంటే నమ్మలేక పోయారు అక్కడి చుట్టూ పక్కల వారు. పుట్టిన రోజున.. చిన్నారికి ఆఖరు రోజు కావడం సత్తుపల్లి పట్టణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..