Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!

జీవితమంటే వడ్డించిన విస్తరి కాదు. కష్టాలు కన్నీళ్లు సరదాలు సంతోషాలు అన్ని ఉంటాయి. అన్నింటిని దాటుకుంటూ ముందుకెళ్లడమే లైఫ్‌. కానీ.. సతీష్ అలా అనుకోలేదు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని కంగారుపడ్డాడు. బిడ్డ అనారోగ్య సమస్యలతో కుంగిపోయాడు. బతుకు దారిలేదని భావించి.. కుటుంబ సమేతంగా సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఫ్యామిలీ మొత్తం చావును కొనితెచ్చుకున్నారు. కానీ వల్లకాలే.. మరి ఏం జరిగింది?

Hyderabad: కుటుంబ సమేతంగా ఆత్మహత్యాయత్నం.. ఒక్క ఫోన్ కాల్ జీవితాలనే మార్చేసింది..!
Family Suicide Attempt

Edited By:

Updated on: Jan 22, 2026 | 9:31 PM

జీవితమంటే వడ్డించిన విస్తరి కాదు. కష్టాలు కన్నీళ్లు సరదాలు సంతోషాలు అన్ని ఉంటాయి. అన్నింటిని దాటుకుంటూ ముందుకెళ్లడమే లైఫ్‌. కానీ.. సతీష్ అలా అనుకోలేదు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని కంగారుపడ్డాడు. బిడ్డ అనారోగ్య సమస్యలతో కుంగిపోయాడు. బతుకు దారిలేదని భావించి.. కుటుంబ సమేతంగా సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఫ్యామిలీ మొత్తం చావును కొనితెచ్చుకున్నారు..!

హైదరాబాద్‌ మహానగరం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ్‌నగర్‌ కాలనీలో నివాసముండే సతీష్‌.. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దానికి తోడు కూతురు శ్రీజవలి (19) అనారోగ్య సమస్యలు మరింత కుంగదీశాయి. దీంతో కుటుంబమంతా చనిపోవాలని నిర్ణయించుకుంది. జనవరి 10వ తేదీన కూతురిని చంపేశాడు సతీష్‌. ఆ తర్వాత సతీష్ కుమార్ (45) తనతోపాటు భార్య ఆమని (40), కుమారుడు నితీష్ కుమార్ (22) ముగ్గురూ కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

మెడికల్ షాప్‌కి వెళ్లి మత్తు ట్యాబ్లెట్లు తెచ్చుకున్నారు. వాటిని కూల్‌డ్రింక్‌లో కలిపి తాగారు. అయినా ఎవ్వరికీ ఏమీ కాలేదు. ఇక లాభం లేదని చేతులు కోసుకున్నారు. బ్లడ్ బయటికి వచ్చింది గానీ ప్రాణం మాత్రం పోలేదు. అయితే నితీష్ కుమార్‌కి వాంతులు కావడంతో స్నేహితుడి కాల్ చేశాడు. అతను ఇంటికెళ్లగా.. అందరూ స్పృహ కోల్పోయి ఉండటం చూసి పోలీసులకు సమాచారమిచ్చాడు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు అందరిని ఆసుపత్రికి తరలించారు.

ముగ్గురిని పరిశీలించిన డాక్టర్లు ట్రీట్‌మెంట్ మొదలెట్టారు. ప్రస్తుతానికి వాళ్ల ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా.. ముందు ముందు ఎలా ఉంటుందో చెప్పలేమన్నారు. ఎక్కువ డోస్‌ ట్యాబ్లెట్ల వాడకంతో లీవర్ దెబ్బతినే ఛాన్స్ ఉందంటుందని డాక్టర్లు అన్నారు. బతకడానికి చాలా మార్గాలుంటాయి. ఆ వైపుగా ఆలోచించకుండా ఈ పిచ్చి పనులేంటని బంధువులు తలలు పట్టుకుంటున్నారు. చచ్చేందుకు వచ్చిన ధైర్యం.. బతకడంలో చూపిస్తే బాగుండేదంటున్నారు.

ఇక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, సూసైడ్ నోట్, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లు సేకరించారు. కుటుంబ సంబంధాలు, రుణాలు, మానసిక ఒత్తిడి వివరాలపై విచారణ చేపట్టారు. స్థానికులు ఆర్థిక సహాయం కోసం ముందుకు వస్తున్నారు. కాగా, ఘటనకు సంబందించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..