రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని వనస్థలిపురం NGOS కాలనీలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. వివేకానంద పార్క్ వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో ఆమె 10 మీటర్ల దూరంలో ఎగిరిపడింది. తీవ్రంగా గాయపడ్డ యువతిని స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఎన్జీవోస్ కాలనీలో రాష్ డ్రైవింగ్‌తో పాదచారులపైకి దూసుకు వచ్చింది కారు. ఈ ఘటన హయత్ నగర్ కి చెందిన సోని(21)కి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వాహనాన్ని నడిపిన వ్యక్తిని పట్టుకున్న స్థానికులు.. పోలీసులకు అప్పగించారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ప్రమాదం దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వనస్థలిపురం పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..