Snakebite: అమ్మానాన్న తిడతారని పాము కరిచినా చెప్పలేదు.. పాపం చిన్నారి ప్రాణం..

|

Jul 26, 2021 | 1:52 PM

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అమ్మానాన్న తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచడంతో ఆ బాలిక....

Snakebite: అమ్మానాన్న తిడతారని పాము కరిచినా చెప్పలేదు.. పాపం చిన్నారి ప్రాణం..
Venomous Snake 1
Follow us on

తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అమ్మానాన్న తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని దాచడంతో ఆ బాలిక ప్రాణం పోయింది. వివరాల్లోకి వెళ్తే.. ఉల్వనూరు పంచాయతీ లక్ష్మీదేవిపల్లికి చెందిన బోడ భాస్కర్‌, భారతి దంపతులకు సంతానం కలగకపోవడంతో ఏడేళ్ల క్రితం బంధువుల పాప అఖిలను దత్తత తీసుకున్నారు. పాపకు 6 నెలల వయసు ఉన్నప్పటి నుంచి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నారు. అఖిలను తన ప్రాణంగా భావించేవారు. ఆదివారం ఎనిమిదో పుట్టినరోజు వేడుకను అమ్మమ్మ ఇంటి వద్ద జరుపుకోవాలని శనివారం అందరూ కలిసి కొత్తగూడెంలోని కారుకొండ రామవరం వెళ్లారు. సాయంత్రం బయటకు వెళ్లిన ఆ చిన్నారి మిత్రులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఓ పాము అఖిల వేలిపై కాటేసింది. దీంతో అఖిల భయంతో ఇంటికి పరుగులు తీసింది. తల్లిదండ్రులు తిడతారనే భయంతో పాము కాటేసిన విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టింది. కాలికి మేకు గుచ్చుకుందని అబద్ధం చెప్పింది. పెద్దగా గాయం కాలేదు.. అసలు విషయం తెలియదు.. దీంతో ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.

కొద్దిసేపటికే అఖిల నోట్లోంచి నురగ రావడం గమనించిన కుటుంబీకులు… అప్పుడు అది పాము కాటుగా గుర్తించారు. వెంటనే స్థానిక ఆర్‌ఎంపీ వద్ద ప్రాథమిక చికిత్స చేయించి.. మెరుగైన వైద్యం నిమిత్తం కొత్తగూడెం తీసుకెళ్లారు. ఐదారు ఆసుపత్రులకు వెళ్లినా.. చేర్చుకోని కారణంగా.. అంబులెన్స్‌లో ఖమ్మం తరలించి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అఖిల రాత్రి చనిపోయింది. ఆదివారం బంధువులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు చేశారు. ప్రాణానికి ప్రాణంలా చూసుకున్న చిన్నారి పుట్టినరోజు వేడుకకు ముందే మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు వేదన వర్ణణాతీతంగా మారింది. వారి రోదన స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.

Also Read: మార్చురీలో నుంచి గురక శబ్దం.. కంగుతిన్న డాక్టర్లు.. చెక్ చేయగా షాక్

టిప్ ఇచ్చేందుకు డబ్బు లేదు.. కానీ ఆ కస్టమర్ డెలవరీ బాయ్‌ను నిరాశపరచలేదు..