
వెల్దుర్తికి చెందిన గొల్ల సుబ్బన్న, సులోచన దంపతులకు రేవతి కుమార్తె. వయసు 8 సంవత్సరాలు. మూడో తరగతి చదువుతోంది. స్థానిక శివాలయంలో కార్తీకదీపం వెలిగించేందుకు రేవతితో కలిసి సులోచన వెళ్ళింది. దీపం వెలిగించిన తర్వాత.. దీపం వెలుగు రేవతి డ్రెస్‌కి అంటుకుంది. మంటలు చెలరేగి ఒంటి నిండా వ్యాపించాయి. మొత్తం శరీరం అంతా కాలింది. తీవ్ర గాయాలయ్యాయి. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కోలుకోలేక నిన్న మృతి చెందింది.
బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రుల దుఃఖం అంతా కాదు. అయ్యో.! ఎంత ఘోరం జరిగింది అంటూ రోధించారు. బ్రతికి ఉండగానే ఆసుపత్రిలో పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి బాధితులను పరామర్శించారు. ఆ తర్వాత మృతి చెందిన సంఘటన తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే కూడా కలత చెందారు. చూశారుగా.! ఈ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణం కూడా పోయే పరిస్థితిలు ఉన్నాయి. సో.! బీ కేర్‌ఫుల్..