Hyderabad: కొబ్బరి పొడి కొంటున్నారా..? అధికారుల తనిఖీల్లో బయటపడ్డ అసలు రంగు..!

|

Dec 08, 2024 | 9:29 AM

హైదరాబాద్‌లో ట్రేడింగ్‌ కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రూల్స్‌కి విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఓ కంపెనీకి నోటీసులు జారీ చేశారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. దీంతో మిగతా ట్రేడింగ్‌ కంపెనీల గుండెల్లో గుబులు మొదలైంది.

Hyderabad: కొబ్బరి పొడి కొంటున్నారా..? అధికారుల తనిఖీల్లో బయటపడ్డ అసలు రంగు..!
Coconut Powder Seized
Follow us on

హైదరాబాద్‌లో ఫుడ్‌ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వరుసగా మెరుపు దాడులు చేస్తున్నారు. తాజాగా బేగంబజార్‌లోని ఆకాష్‌ ట్రేడింగ్‌ కంపెనీలో అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో 60 టన్నుల కొబ్బరిపొడిని సీజ్ చేశారు అధికారులు. సీజ్‌ చేసిన కొబ్బరిపొడి విలువ 92 లక్షల 47 వేలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా రూల్స్‌కి విరుద్ధంగా కోకోనట్‌ పౌడర్‌ను ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచినట్టు అధికారులు గుర్తించారు.

పలు బ్రాండ్ల పేరుతో కొబ్బరి పొడిని ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు గుర్తించారు అధికారులు. ఈ కోకోనట్‌ పౌడర్‌ శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఆకాష్‌ ట్రేడింగ్‌ కంపెనీకి నోటీసులు జారీ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. FSSAI నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో కేసు నమోదు చేశారు. సీజ్‌ చేసిన కోకోనట్‌ పౌడర్‌ నాణ్యతను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు. ల్యాబ్‌ నుంచి రిపోర్ట్స్‌ వచ్చాక ఆకాష్‌ ట్రేడింగ్‌ కంపెనీపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కల్తీ కొబ్బరిపొడి అనే అనుమానంతో ఫుడ్‌ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు చేశారు. అయితే రూల్స్‌కు విరుద్ధంగా ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తేలడంతో నోటీసులు జారీ చేశారు.

గత కొన్ని రోజులుగా తెలంగాణలో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు వరుసగా దాడులు చేస్తున్నారు. రెస్టారెంట్లు, హోటళ్లు, ఫుడ్‌ కోర్టుల్లో తనిఖీలు చేస్తున్నారు. కల్తీ పదార్థాలు, అపరిశుభ్రమైన వాతావరణంతో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లకు నోటీసులు జారీ చేశారు. కొన్నింటికి సీజ్‌ చేశారు. ఇక ఇప్పుడు ట్రేడింగ్‌ కంపెనీల్లోనూ తనిఖీలు నిర్వహిస్తుండటంతో నిర్వాహకుల్లో వణుకు మొదలైంది.

వీడియో చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..