Anthrax: మరో మహామ్మరి కలకలం.. ఆంత్రాక్స్ లక్షణాలతో గొర్రెల మృతి.. జనాలు హడల్..

| Edited By: Ravi Kiran

Oct 26, 2021 | 2:52 PM

అసలే కరోనాతో సతమతమవుతున్న ప్రజలకు.. మరో మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో...

Anthrax: మరో మహామ్మరి కలకలం.. ఆంత్రాక్స్ లక్షణాలతో గొర్రెల మృతి.. జనాలు హడల్..
Anthrax
Follow us on

అసలే కరోనాతో సతమతమవుతున్న ప్రజలకు.. మరో మహమ్మారి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం రేపుతోంది. ఇటీవల ఆంత్రాక్స్ లక్షణాలతో నాలుగు గొర్రెలు మృత్యువాతపడటంతో స్థానికుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

దుగ్గొండి మండలం చాపలబండి గ్రామంలో వెటర్నరీ వైద్యులు ఆంత్రాక్స్ వ్యాధిని గుర్తించారు. అనారోగ్యంతో మరణించిన నాలుగు గొర్రెలలో ఆంత్రాక్స్ లక్షణాలను గుర్తించిన వెటర్నరీ సిబ్బంది.. వ్యాధి నిర్ధారణ కోసం శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించారు. గతంలోనూ వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ బయటపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాగా, ఈ వ్యాధి మనుషులకు సోకితే ప్రాణాలకే ప్రమాదమని అధికారులు చెబుతున్నారు.

ఆంత్రాక్స్ వ్యాధి వ్యాప్తి, లక్షణాలు ఇలా..

వైరస్ వ్యాప్తి: కేవలం ధూళి ద్వారా ఆంత్రాక్స్ న్యుమోనియా జనాలకు సోకుతుందని తెలిపారు. కలుషిత ఆహారం, మాంసం ద్వారా కూడా ఆంత్రాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

ప్రాథమిక లక్షణాలు: ఆంత్రాక్స్ వస్తే వికారం, వాంతులు, విరేచనాలు కలుగుతాయని వైద్య నిపుణులు తెలిపారు. జలుబు, కరోనా మాదిరిగా అంటు వ్యాధి మాత్రం కాదని అక్కడి వైద్యులు అంటున్నారు.

Also Read:

ఈ 5 విషయాలను ఎప్పుడూ మర్చిపోవద్దు.. లేదంటే ఏ సమస్యకి పరిష్కారం దొరకదు..