New Degree Colleges: విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు.. ఎక్కడంటే..?

|

Jul 31, 2021 | 10:55 AM

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు...

New Degree Colleges: విద్యార్థులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో కొత్తగా 4 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు.. ఎక్కడంటే..?
students
Follow us on

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మరో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ అకడమిక్ ఇయర్ నుంచే ఈ నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. వికారాబాద్, పరిగి, ఉప్పల్, మహేశ్వరం ప్రాంతాలల్లో కొత్త డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. విద్యా శాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.  అయితే మంజూరు చేసిన అన్ని కాలేజీలు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బాగా పట్టున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయి.  ఈ క్రమంలో ముఖ్యమంత్రికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రభుత్వ డిగ్రీ కాలేజీల మంజూరుపై ఆయా ప్రాంతాల స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ పాఠాలు

దేశంలోని పేద, వెనుకబడిన వర్గాలకు హైయ్యర్ ఎడ్యుకేషన్ మరింత ఈజీ చేయడంలో భాగంగా స్థానిక భాషల్లోనే వారికి విద్య అందించేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్‌ కోర్సులను ఐదు భాషల్లో బోధించనున్నట్టు తెలిపారు. ఎనిమిది రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్‌ కాలేజీల్లో విద్యా బోధన ఐదు భారతీయ భాషల్లో ప్రారంభం కాబోతుండటం సంతోషకరమన్నారు. హిందీ, తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో విద్యా బోధన ప్రారంభమవుతుందని వెల్లడించారు.

Also Read: Nellore: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా చాక్లెట్స్.. ఎగబడ్డ జనం.. చివర్లో ఊహించని ట్విస్ట్

Viral Video: కొండచిలువను పట్టి కరకరా నమిలి మింగేసిన మొసలి.. చూస్తే షాకవుతారు