Employees Promotions: తెలంగాణ మార్కెట్‌ శాఖ ఉద్యోగులకు శుభవార్త.. 32 మంది ఉద్యోగులకు పదోన్నతి

Employees Promotions: తెలంగాణ మార్కెటింగ్‌ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 27ను విడుదల చేసింది. 11 మంది గ్రేడ్‌ వన్‌ కార్యదర్శుల..

Employees Promotions: తెలంగాణ మార్కెట్‌ శాఖ ఉద్యోగులకు శుభవార్త.. 32 మంది ఉద్యోగులకు పదోన్నతి

Updated on: Jan 22, 2021 | 10:00 PM

Employees Promotions: తెలంగాణ మార్కెటింగ్‌ శాఖలో పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్‌ 27ను విడుదల చేసింది. 11 మంది గ్రేడ్‌ వన్‌ కార్యదర్శులకు స్పెషల్‌ గ్రేడ్‌ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. మార్కెటింగ్‌ సంచాలకుల కార్యాలయం నుంచి మరో 21 మంది అసిస్టెంట్‌ కార్యదర్శులకు గ్రేడ్‌ వన్‌ కార్యదర్శులుగా పదోన్నతి లభించింది.

కాగా, మొత్తం 32 మందికి ఈ పదోన్నతులు లభించాయి. మార్కెటింగ్‌ శాఖలో పని చేసే ప్రతి ఉద్యోగికి న్యాయం చేస్తామని, శాఖపరంగా ఉద్యోగులకు రావాల్సిన వాటిలో ఎలాంటి సమస్య రాకుండా చూస్తామని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మార్కెటింగ్‌ శాఖలో ప్రతి సంవత్సరం పదోన్నతులు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. పదోన్నతి పొందిన ఉద్యోగులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి శాఖలోనూ పదోన్నతులు కల్పిస్తున్నారని, ఉద్యోగులకు అన్ని విధాలుగా సదుపాయాలు కల్పిస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా సహకారం అందేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు.

కౌన్ బనేగా బల్దియా బాద్‌షా… అధికార పార్టీలో మేయర్ ఎన్నిక సందడి.. ఆశావహుల ప్రయత్నాలు ముమ్మరం..