Telangana Rythu Bandhu: తెలంగాణలో కొత్తగా 2.22 లక్షల మందికి రైతు బంధు.. మొత్తం 61.55 లక్షల మందికి సాయం

|

Jun 13, 2021 | 8:07 AM

Telangana Rythu Bandhu: ప్రస్తుతం వర్షాకాలంలో రైతుబంధు పథకానికి కొత్తగా అర్హులైన రైతుల సంఖ్య 2.22 లక్షలు ఉన్నట్లు తేలింది. రెవెన్యూ శాఖలో భూ రికార్డుల ప్రకారం..

Telangana Rythu Bandhu: తెలంగాణలో కొత్తగా 2.22 లక్షల మందికి రైతు బంధు.. మొత్తం 61.55 లక్షల మందికి సాయం
Telangana Rythu Bandhu
Follow us on

Telangana Rythu Bandhu: ప్రస్తుతం వర్షాకాలంలో రైతుబంధు పథకానికి కొత్తగా అర్హులైన రైతుల సంఖ్య 2.22 లక్షలు ఉన్నట్లు తేలింది. రెవెన్యూ శాఖలో భూ రికార్డుల ప్రకారం.. గత యాసంగిలో 59.33 లోల మందికి ఈ పథకం సొమ్ము అందింది. కొత్తగా 2.22 లక్షల మంది రైతులకు చేరుతున్నందున ఈ మొత్తం అందుకునే వారి సంఖ్య 61.55 లక్షలు ఉంటుందని ప్రాథమిక అంచనా. ఈ నెల 10 వరకూ భూములను కొన్న రైతులను పథకంలో నమోదు చేయాల్సి ఉంది. ఈనెల 10వ తేదీ వరకు మొత్తం 2.22 లక్షల మంది రైతులను పార్ట్‌ బీ నుంచి పార్ట్‌- ఏ ఖాతాల్లోకి మార్చినట్లు రెవెన్యూశాఖ అధికారులు వెల్లడించారు. వీరి పేర్లకు వారి బ్యాంకు అకౌంట్‌ నెంబర్‌, ఇతర వివరాలు పరిశీలించి రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. తమ పేర్లను నమోదు చేయాలంటూ అధికారుల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు.

అలాగే ఆధార్‌ అనుసంధానం, ఎన్‌ఆర్‌ఐ కేసులు, ఏజన్సీ భూ సమస్యలు, ఫిర్యాదుల ద్వారా  వచ్చినవి, పాసు పుస్తకాలు లేకుండా వారసత్వ బదిలీ, కోర్టు కేసుల్లో ఉన్నవి, పెండింగ్‌ మ్యుటేషన్‌లకు సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ కూడా చదవండి:

Telangana CM KCR: ప్రగతి భవన్‌లో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష.. పలు కీలక అంశాలపై చర్చ..!

Hyderabad ORR Alert : వాహనదారులకు గమనిక..! కోకకోలా జంక్షన్ నుంచి ట్రాఫిక్ మళ్లింపు.. ఎప్పటి నుంచి అంటే..?