Telangana: డ్యాన్స్‌ చేస్తుండగానే అనంతలోకాలకు.. మరో షాకింగ్ సంఘటన.. పట్టుమని పాతికేళ్లు కూడా..

అప్పటి వరకు నవ్వుతూ, సరదగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అందరితో కలివిడిగా ఉన్న వారు అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్‌ మీడియా వాడకం పెరగడంతో ఇలాంటి...

Telangana: డ్యాన్స్‌ చేస్తుండగానే అనంతలోకాలకు.. మరో షాకింగ్ సంఘటన.. పట్టుమని పాతికేళ్లు కూడా..
Young Boy Collapsed

Updated on: Feb 26, 2023 | 11:14 AM

అప్పటి వరకు నవ్వుతూ, సరదగా ఉంటున్న వ్యక్తులు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. అందరితో కలివిడిగా ఉన్న వారు అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇటీవల ఇలాంటి సంఘటనలు సర్వసాధారణంగా మారాయి. స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్‌ మీడియా వాడకం పెరగడంతో ఇలాంటి సంఘటనలకు సంబంధించి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అప్పటి వరకు బాగున్న వ్యక్తులు గుండె పోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి నిర్మల్‌ జిల్లాలో చోటు చేసుకుంది. అప్పటి వరకు హుషారుగా డ్యాన్స్‌ చేస్తున్న ఓ కుర్రాడు ఉన్నపలంగా కుప్పకూలిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా కుభీర్ మండలం లోని పార్డి(కె) గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పార్డి ( కె ) గ్రామానికి చెందిన కిష్టయ్య కుమారుని వివాహం శుక్రవారం బైంసా మండలంలోని కామోల్ గ్రామంలో జరిగింది. శనివారం పార్డి(కె) లో వివాహ వేడుకకు సంబంధించి విందు జరిగింది. ఈ ఇందులో పెళ్లి కుమారుని సమీప బంధువు మిత్రుడైన మహారాష్ట్రలోని శివుని గ్రామానికి చెందిన ముత్యం (19) అనే యువకుడు పెళ్లి వేడుకకు హాజరయ్యాడు‌‌. రాత్రి రిసెప్షన్ జరుగుతున్న సమయంలో సరదగా డ్యాన్స్ చేశాడు. చేస్తున్న వ్యక్తి చేస్తున్నట్లుగానే కుప్పకూలిపోయాడు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే యువకుడు అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అప్పటి వరకు సరదాగా గడిపిన వ్యక్తి అలా చనిపోవడంతో వివాహానికి హాజరైన వారంతా ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. దీనంతటినీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వీడియోగా తీశారు దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..