Telangana: ఓరి నాయనా.. మళ్లీ వచ్చిన మాయదారి వైరస్.. ఆ స్కూల్లో 15 మందికి పాజిటివ్‌

|

Apr 06, 2023 | 6:17 PM

దేశంలో మరోసారి కరోనా విజృంభించడానికి సిద్ధమవుతోందా.? అంటే తాజాగా గణంకాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ బుధవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి....

Telangana: ఓరి నాయనా.. మళ్లీ వచ్చిన మాయదారి వైరస్.. ఆ స్కూల్లో 15 మందికి పాజిటివ్‌
Representative Image
Follow us on

దేశంలో మరోసారి కరోనా విజృంభించడానికి సిద్ధమవుతోందా.? అంటే తాజాగా గణంకాలు చూస్తుంటే అవుననే సమాధానం వస్తోంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏప్రిల్ 5వ తేదీ బుధవారం ఒకే రోజు దేశవ్యాప్తంగా 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు 25 వేలు దాటాయి. 24 గంటల్లోనే 5 వేల 335 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 15 మంది మరణించారు.

ఇదిలా ఉంటే తెలంగాణలోనూ కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని ఓ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు కరోనా సోకింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్‌ వెల్ఫేర్‌ బాలుర గురుకుల పాఠశాలలో ఏకంగా 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. హాస్టల్‌లో ఉంటున్న కొందరు విద్యార్థులకు జ్వరం, జలుబు ఉండడంతో గురువారం వైద్యులు పరీక్షలు నిర్వహించగా 15 మంది పాజిటివ్‌గా నిర్ధారించారు.

వెంటనే విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిని ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఒకే పాఠశాలలో 15 మంది కరోనా సోకడంతో విద్యార్థుల తల్లిదండ్రులుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌లో ఉన్న మిగతా విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్లేందుకు పేరెంట్స్‌ చేరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..