ఆవిష్కరణకు సిద్ధమైన 125 అడుగుల డా. బీఆర్‌ అబేండ్కర్ విగ్రహం..కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. శుక్రవారం రోజున అంగరంగ వైభవంగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం అని ఏర్పాట్లు చేసింది.

ఆవిష్కరణకు సిద్ధమైన 125 అడుగుల డా. బీఆర్‌ అబేండ్కర్ విగ్రహం..కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
Dr.br Ambedkar Statue

Updated on: Apr 13, 2023 | 7:33 AM

హైదరాబాద్‌లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్ అంబేడ్కర్‌ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైంది. శుక్రవారం రోజున అంగరంగ వైభవంగా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం అని ఏర్పాట్లు చేసింది. అయితే దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాల్లోకెల్లా అతి ఎత్తైన విగ్రహంగా హైదరాబాద్‌లో నిర్మించిన ఈ విగ్రహం ఖ్యాతి గడించబోతోంది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల పీఠం, ఆపైన 125 అడుగుల నిలువెత్తు లోహ విగ్రహాన్ని తయారుచేశారు. అంబేడ్కర్ 132 వ జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ బౌద్ధ గురువుల ప్రార్థనల మధ్య ఆవిష్కరించనున్నారు.

ఈ కార్యక్రమంలో అంబేడ్కర్‌ మనవడు ప్రకాష్‌ అంబేడ్కర్‌, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చేలా రవాణా సదుపాయం కల్పించనుంది. అన్ని నియోజకవర్గాల నుంచి హాజరయ్యేలా 750 బస్సులను ఆయా ప్రాంతాలకు పంపనుంది. దాదాపు 50 వేల మంది కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, ఇతర సౌకర్యాలను కల్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..