AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Youtube New Feature: ఇకపై యూట్యూబ్‌లో ఆ ఆప్షన్ ఉండదా.? వారి మధ్య యుద్ధానికి చెక్ పడుతుందా..?

Youtube New Feature: ఇప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూస్తున్నాం. మనకు అంతకు ముందు తెలిసిన విషయాలను కూడా..

Youtube New Feature: ఇకపై యూట్యూబ్‌లో ఆ ఆప్షన్ ఉండదా.? వారి మధ్య యుద్ధానికి చెక్ పడుతుందా..?
Youtube Removing Option
Narender Vaitla
|

Updated on: Apr 01, 2021 | 6:09 PM

Share

Youtube New Feature: ఇప్పుడు ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి వీడియోలు చూస్తున్నాం. మనకు అంతకు ముందు తెలిసిన విషయాలను కూడా యూట్యూబ్‌లో చూసి మరీ చేస్తున్నాం. స్మార్ట్ ఫోన్ వాడే వారిలో యూట్యూబ్‌ది ప్రథమ స్థానమని గణంకాలు కూడా చెబుతున్నాయి. అయితే అంతా బాగానే ఉంది కానీ.. యూట్యూబ్‌లో వీడియోలకు లైక్, డిజ్‌లైక్ కొట్టే ఆప్షన్ ఉందని మనందరికీ తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే కొన్ని సందర్బాల్లో కొందరు వ్యక్తులు తమకు నచ్చిన హీరోకు సంబంధించిన పాటలకు, సినిమాకు లైక్‌లు కొట్టడంలో చూపించే ఆసక్తి ఇతరుల వీడియోలకు డిజ్ లైక్ కొట్టడంలో చూపిస్తున్నారు. ఈ కారణంగానే కొన్ని వీడియోలకు రికార్డు స్థాయిలో డిజ్ లైక్‌లు వస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ డిజ్ లైక్‌ల వ్యవహారం ఎంతటి రచ్చ రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే దీనికి చెక్ పెట్టే లక్ష్యంగా యూట్యూబ్ సరికొత్త నిర్ణయం తీసుకుంటోంది. ఇకపై భవిష్యత్తులో డిజ్‌లైక్ ఆప్షన్ కనిపించకుండా చర్యలు తీసుకునే క్రమంలో యూట్యూబ్ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తున్నట్లు యూట్యూబ్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఇకపై యూట్యూబర్ యూజర్లు కొట్టే డిజ్ లైక్‌లు అందరికీ కనిపించవని ట్వీట్ చేసింది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. మరి అభిమానుల మధ్య జరుగుతోన్న లైక్, డిజ్ లైక్‌ల యుద్ధానికి దీనితోనైనా చెక్ పడుతోందా చూడాలి.

యూట్యూబ్ చేసిన ట్వీట్..

Also Read: High Speed Internet: హైస్పీడ్ ఇంటర్నెట్‌ను అందించేందుకు కొత్త పరికరం.. అభివృద్ధి చేసిన ఆస్ట్రోమ్‌ స్టార్టప్‌

Google Maps: మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు సిద్ధమైన గూగుల్.. ఆ ఫిచర్‌తో ప్రయోజనాలేంటంటే..

New Scam In WhatApp: ఉచితమని క్లిక్‌ చేశారో మీ పని గోవిందా..? జియో రీఛార్జ్‌ పేరుతో వాట్సాప్‌లో మోసపూరిత లింక్‌..