Xiaomi car: షావోమీ కారుకు సంబంధించి అధికారిక ప్రకటన.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా..
ఈ కారుకు షావోమీ ఎస్‌యూ7గా నామకరణం చేసింది. అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్‌లో ఈ కారును తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా కారుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈవీ వాహనాల రంగంలో రానున్న రోజుల్లో అగ్రగామిగా రాణించాలన్నదే తమ లక్ష్యమని షావోమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ తెలిపారు. వచ్చే 15 నుంచి 20 ఏళ్లలో ప్రపంచంలోని టాప్ 5 ఆటోమొబైల్ తయారీదారుల్లో...
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ కార్ల తయారీ రంగంలోకి ఎంట్రీ ఇస్తుందని గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇందుకు సంబంధించి కంపెనీ అధికారిక ప్రకటన చేసింది. గురువారంలో చైనాలో జరిగిన షావోమీ ఈవీ టెక్నాలజీ లాంచ్ ఈవెంట్‌లో ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. షావోమీ నుంచి వస్తున్న తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది.
ఈ కారుకు షావోమీ ఎస్‌యూ7గా నామకరణం చేసింది. అత్యాధునిక ఫీచర్లు, స్టైలిష్ లుక్‌లో ఈ కారును తీసుకొస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ సందర్భంగా కారుకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈవీ వాహనాల రంగంలో రానున్న రోజుల్లో అగ్రగామిగా రాణించాలన్నదే తమ లక్ష్యమని షావోమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ తెలిపారు. వచ్చే 15 నుంచి 20 ఏళ్లలో ప్రపంచంలోని టాప్ 5 ఆటోమొబైల్ తయారీదారుల్లో ఒకరిగా ఎదుగుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇక షావోమీ లాంచ్ చేయనున్న ఎస్‌యూ7 కారు విషయానికొస్తే.. ఇప్పటికే ఈ కారు తయారీ ప్రారంభమైంది. బీజింగ్‌లోని బీఏఐసీ అనే కార్ల తయారీ కంపెనీ షావోమీ కార్లను తయారు చేయనుంది. ఏడాదికి రెండు లక్షల కార్ల తయారీచేయగల కెపాసిటీ ఈ ప్లాంట్ సొంతం. ఇక ఈ కారు డైమెక్షన్స్ విషయానికొస్తే.. 4997 ఎమ్‌ఎమ్ పొడవు, 1963 ఎమ్‌ఎమ్‌ల వెడల్పు, 3000 ఎమ్‌ఎమ్ వీల్ బేస్‌తో రానుంది.
షావోమీ ఎంట్రీ లెవల్ కారు 73.6 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. ఇక టాప్ ఎండ్ విషయానికొస్తే 101 కేడబ్ల్యూహెచ్ కెపాసిటీగల బ్యాటరీని ఇవ్వనున్నారు. ఈ కార్లలో షావోమీ ప్రత్యేకంగా సెల్ టు బాడీ అనే టెక్నాలజీని తీసుకొస్తోంది. ఇక ఇక ఈ కారును ఒక్కసారి ఫుల్ ఛార్జింగ్ చేస్తే ఏకంగా 800 కిలోమీటర్లు నాన్ స్టాప్‌గా దూసుకుపోతుందని కంపెనీ చెబుతోంది. అలాగే క్యాబిన్ విశాలంగా ఉండాలనే ఉద్దేశంతో క్యాబిన్ ఎత్తును తగ్గిస్తున్నారు. ఈ కారులో 21,000 ఆర్‌పిఎమ్ గరిష్ట రోటర్ వేగంతో వీ6, వీ6ఎస్‌లు భారీ సంఖ్యలో ఉత్పత్తి అవుతాయి.
27,200 ఆర్‌పిఎమ్ సామర్థ్యం కలిగిన షియోమీ హైపర్ ఇంజిన్ వీ8ఎస్ 2025 నాటికి మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయి. ఇక షావోమీ ఈ కార్లలో సెల్ఫ్ పార్కింగ్, సెల్ఫ్ డ్రైవింగ్ వంటి అధునాతన ఫీచర్లను అందించనున్నట్లు సమాచారం. ఇక ఈ కారులో హై రిజల్యూషన్‌తో కూడిన కెమెరాలను ఉపయోగించనున్నారని తెలుస్తోంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..