X Accounts: ‘ఎక్స్‌’లో ఎవరూ ఊహించని ఫీచర్.. బయటపడనున్న ఫేక్ అకౌంట్లు

ఎక్స్‌లో ఇక ఫేక్ అకౌంట్లకు చెక్ పడనుంది. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు ఎక్స్ నడుం బిగించింది. అందులో భాగంగా ఫేక్ అకౌంట్లను అడ్డుకునేలా కొత్త ఫీచర్‌ను తాజాగా తీసకొచ్చింది. ఎక్స్ కొత్తగా తెచ్చిన ఫీచర్ ఏంటి..? దీని వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి..?

X Accounts: ఎక్స్‌లో ఎవరూ ఊహించని ఫీచర్.. బయటపడనున్న ఫేక్ అకౌంట్లు
X Platform

Updated on: Nov 22, 2025 | 5:47 PM

Fake X Accounts: ఎలాన్ మాస్క్ నేతృత్వంలోని ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి యూజర్ల బేసిక్ సమాచారం తెలసుకునేందుకు ఏబౌట్ ఆన్ అకౌంట్ అనేక ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా యూజర్ ఏ లోకేషన్‌ నుంచి అకౌంట్ వాడుతున్నాడనే విషయంతో పాటు యూజర్ నేమ్ ఎన్నిసార్లు మార్చాడు..? ఎక్స్‌లో ఎప్పుడు జాయిన్ అయ్యాడు..? యాప్ ఎలా డౌన్‌లోడ్ చేసుకున్నాడనే వివరాలను ప్రదర్శించనుంది. ఏఐ, బాట్‌ల వద్ద ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జెన్యూన్ యూజర్లను గుర్తించేందుకు ఈ ఫీచర్‌ను ఎక్స్ తీసుకొచ్చింది. దీని వల్ల భద్రత పెరుగుతుందని, అనుమానాస్పద అకౌంట్లను నివారించడం సులువు అవుతుందని ఎక్స్ వెల్లడించింది.

ఎక్స్‌లో నకిలీ అకౌంట్లు సృష్టించి కొంతమంది తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. దీని వల్ల ప్రమాదం పొంచి ఉంది. యూజర్ల సమాచారం బహిర్గతం చేయడం ద్వారా వినియోగదారులు వ్యక్తిని నిర్ధారించుకుని ఆ సమాచారం నమ్మవచ్చా.. లేదా అనేది ఆలోచించుకుంటారు. ప్రస్తుత కొంతమంది యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా.. త్వరలో అందరికీ కనిపించనుంది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి ఫీచర్ ఉండగా.. ఇప్పుడు ఎక్స్ కూడా తీసుకొచ్చింది. అక్టోబర్‌లో ఎక్స్ హెడ్ నికితా బియర్ ఈ ఫీచర్‌ను తొలిసారి తన అకౌంట్‌లో పరీక్షించిన విషయం తెలిసిందే.

ఈ ఫీచర్‌ను ఎలా యాక్సెస్ చేయాలి..?

ఎక్స్ మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.. ఆ తర్వాత జాయిన్డ్ డేట్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. అక్కడ ఎక్స్‌లో జాయిన్ అయిన డేట్, లొకేషన్ కనిపిస్తాయి. ఇక ఎన్నిసార్లు అకౌంట్ నేమ్ మార్చారు అనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు.  గూగుల్ ప్లే లేదా యాప్ స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుున్నారా అనే సమాచారం కూడా ఉంటుంది. యూజర్లు ఏ సమాచారం అయితే బయటకు చూపించాలనుకుంటున్నారో అక్కడ సెలక్ట్ చేసుకోవచ్చు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి