Flight Emergency Landing: విమానాలను అత్యవసర ల్యాండింగ్‌ ఎందుకు చేస్తారు? అప్పుడు ఫ్లైట్ వేగం ఎంత ఉంటుంది?

Flight Emergency Landing: విమానం అత్యవసర ల్యాండింగ్‌ అనేది అన్ని సమయాల్లో చేయరు. విమానంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ముందు జాగ్రత్తగా పైలట్‌ విమాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేస్తాడు. అలాగే ఇంధన లీక్, క్యాబిన్ ఒత్తిడి కోల్పోవడం, ల్యాండింగ్ గేర్..

Flight Emergency Landing: విమానాలను అత్యవసర ల్యాండింగ్‌ ఎందుకు చేస్తారు? అప్పుడు ఫ్లైట్ వేగం ఎంత ఉంటుంది?
Flight Emergency Landing

Updated on: Jan 28, 2026 | 12:43 PM

Flight Emergency Landing: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్‌ పవర్‌ విమాన ప్రమాదానికి గురైన విషయంలో తెలిసిందే. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం సహా మొత్తం ఆరుగురు మృతి చెందారు.బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన మొత్తం మహారాష్ట్రను కుదిపేసింది. అయితే సాంకేతిక సమస్యలతో చాలా విమనాలు రన్‌వేపై కుప్పకూలడం, రన్‌వేను ఢీకొట్టడం లాంటివి జరుగుతుంటాయి. మరి విమాన రన్‌వేపై ల్యాండ్‌ అవుతుండగా, ఎంత వేగం ఉంటుందో తెలుసా? ఇలాంటి ప్రమాద సంఘటనలు ఎన్నో జరిగాయి. ఇటీవల అహ్మదాబాద్‌లో ఓ భవనంపై కూలిన విమానం 241 మంది మృతి చెందారు. ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు పైలట్‌ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి పరిస్థితిలో పైలట్ ఏం చేస్తారో తెలుసుకుందాం.

అత్యవసర ల్యాండింగ్ ఎప్పుడు చేస్తారు?

అత్యవసర ల్యాండింగ్‌ అనేది అన్ని సమయాల్లో చేయరు. విమానంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు ముందు జాగ్రత్తగా పైలట్‌ విమాన్ని అత్యవసరంగా ల్యాండింగ్‌ చేస్తాడు. అలాగే ఇంధన లీక్, క్యాబిన్ ఒత్తిడి కోల్పోవడం, ల్యాండింగ్ గేర్ సమస్యలు లేదా వైద్య అత్యవసర పరిస్థితిలో ఫైట్‌ అత్యవసర ల్యాండింగ్‌ అవసరం అవుతుంది.

ఇది కూడా చదవండి:  WhatsApp: యూజర్లకు షాకింగ్‌ న్యూస్‌.. ఇక డబ్బులు చెల్లిస్తేనే వాట్సాప్‌ సేవలు..!

ఇవి కూడా చదవండి

ల్యాండింగ్‌లు ఎన్ని రకాలు ఉంటాయి?

విమానం ల్యాండింగ్‌ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. పరిస్థితులను బట్టి అత్యవసర ల్యాండింగ్‌ చేస్తుంటారు పైలట్లు. ఇక ఫెడరేషన్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నివేదిక ప్రకారం.. అత్యవసర ల్యాండింగ్‌లు ప్రధానంగా మూడు రకాలుగా ఉంటాయి.

1. ఇంజిన్ అకస్మాత్తుగా ఆగిపోయినప్పుడు

2. ఇంధనం అయిపోవడం వంటి, లేదా ఇతర ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని పైలట్‌ ముందస్తుగా గుర్తించినట్లయితే.

3. విమానం భూమిపై కాకుండా నీటిపై (నది, సరస్సు లేదా సముద్రం) దిగవలసి వచ్చినప్పుడు.

అత్యవసర ల్యాండింగ్ సమయంలో విమానం వేగం ఎంత ఉంటుంది?

సాధారణంగా సాధారణ ల్యాండింగ్‌లో విమానం వేగం గంటకు 240 నుండి 300 కి.మీ వేగం ఉంటుంది. అయితే విమానాల రకాలను బట్టి స్పీడ్‌ అనేది ఉంటుంది. కానీ అత్యవసర ల్యాండింగ్ సమయంలో పైలట్ వేగాన్ని తగ్గిస్తాడు. ఇది సాధారణంగా గంటకు 150 నుండి 200 కి.మీ.ల మధ్య ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ వేగంతో ఆపడానికి ఎక్కువ దూరం అవసరం అవుతుంది. అయితే అత్యవసర ల్యాండింగ్‌ చేయాల్సి వస్తే పైలట్ కొన్ని పద్దతులను అనుసరిస్తారు.

  • “మేడే” అని పిలవడం: ముందుగా, పైలట్ “మేడే మేడే మేడే” అని మూడు సార్లు పిలవడం ద్వారా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి హెచ్చరిక చేస్తాడు.
  • ల్యాండింగ్ సైట్‌ను ఎంచుకోవడం: పైలట్ సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. సమీప రన్‌వే, హైవే, ఓపెన్ ఫీల్డ్.
  • వేగం, ఎత్తును నియంత్రించడానికి: ఫ్లాప్‌లు, ల్యాండింగ్ గేర్‌లను ఉపయోగించి, విమానం గాలిలో నిలిచిపోకుండా వేగం, ఎత్తును తగ్గిస్తారు.
  • గాలి దిశను పరిగణనలోకి తీసుకోవాలి: విమానం సహజంగా నెమ్మదించేలా ల్యాండింగ్ ఎల్లప్పుడూ గాలికి వ్యతిరేకంగా జరుగుతుంది.
  • ఇంజిన్ లేదా వ్యవస్థను నిలిపివేయడం: ఇంజిన్‌కు మంటలు లేదా ప్రమాదం ఉంటే ఇంధన సరఫరా, విద్యుత్ వ్యవస్థను నిలిపివేస్తుంది.
  • ప్రయాణికులకు అలర్ట్‌: క్యాబిన్ సిబ్బంది ప్రయాణికులను “బ్రేస్ పొజిషన్” తీసుకోవాలని, సీట్ బెల్టులు బిగించుకోవాలని, మాస్క్‌లు ధరించాలని సూచిస్తారు.
  • రన్‌వే లేకపోతే, విమానం పొలం, నేల, గడ్డి లేదా నీటిపై ల్యాండింగ్‌ చేస్తారు. విమానం ఆగిన వెంటనే, అత్యవసర స్లయిడ్‌లను తెరిచి ప్రయాణికులను త్వరగా ఖాళీ చేయిస్తారు. అగ్నిమాపక దళం, వైద్య బృందం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంటాయి.

ఇది కూడా చదవండి: ATM Notes: ఇక ఏటీఎంలలో 10,20,50 రూపాయల నోట్లు.. అక్కడ ట్రయల్‌ ప్రారంభం!

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి