Whatsapp: ఆ సమస్యకు ఎట్టకేలకు చెక్‌ పెడుతోన్న వాట్సాప్‌.. ఫొటోలు సెండ్ చేసే విషయంలో..

|

Jan 23, 2023 | 2:44 PM

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. ఇతర కంపెనీల నుంచి పెరుగుతోన్న పోటీనీ తట్టుకునే క్రమంలో, యూజర్లను సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటూనే ఉంది. ఇటీవలి కాలంలో వాట్సాప్‌ వరసపెట్టి ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది...

Whatsapp: ఆ సమస్యకు ఎట్టకేలకు చెక్‌ పెడుతోన్న వాట్సాప్‌.. ఫొటోలు సెండ్ చేసే విషయంలో..
Whatsapp
Follow us on

మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. ఇతర కంపెనీల నుంచి పెరుగుతోన్న పోటీనీ తట్టుకునే క్రమంలో, యూజర్లను సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటూనే ఉంది. ఇటీవలి కాలంలో వాట్సాప్‌ వరసపెట్టి ఫీచర్లను పరిచయం చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను పరిచయం చేసేందుకు వాట్సాప్‌ సిద్ధమైంది. సాధారణంగా వాట్సాప్‌ విషయంలో యూజర్లకు ఉండే ఫిర్యాదుల్లో ఫొటో క్వాలిటీ ఒకటి. గ్యాలరీలో ఎంతో క్వాలిటీతో కనిపించే ఫొటోను ఇతరులకు పంపించగానే క్లారిటీ తగ్గుతుంది.

మనలో చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. తాజాగా ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికే వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఒరిజినల్‌ క్వాలిటీతో ఫొటోలను పంపించేందుకు వీలుగా ఫొటో క్వాలిటీ అనే ఫీచర్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఇతరులకు షేర్‌ చేసే ఫొటోలు అవతలి వారికి కంప్రెస్డ్, గ్రైనీగా సెండ్‌ అవుతున్నాయి. ఎంత క్వాలిటీ ఉన్నా ఈమేజ్‌లు అయినా క్లారిటీ తగ్గి సెండ్ అవుతాయి.

ఈ ఫీచర్‌ సహాయంతో యూజర్లు తాము పంపుతున్న ఫొటోల క్వాలిటీని అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2.23.2.11 వాట్సాప్ బీటా అప్‌డేట్‌లో ఈ ఫీచర్‌ను తీసుకురానున్నారు. ప్రస్తుతం డెవలపింగ్ స్టేజ్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే అందరికీ అందుబాటులోకి తీసుకున్నారు. వాట్సాప్‌ ఈ ఫీచర్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది. ఈ ఫీచర్‌ కనుగ అందుబాటులోకి వస్తే ఇకపై యూజర్లు ఫొటోలను హెడ్‌డీ క్లారిటీలో పంపుకోవచ్చన్నమాట.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..