WhatsApp: ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో వాట్సాప్ మొదటి వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఎప్పటికప్పుడు యూజర్ల అవసరాలకు అనుగుణంగా కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది కాబట్టే ఈ మెసేజింగ్ యాప్‌కు అంతటి క్రేజ్ ఉంది. అయితే గతకొన్ని రోజుల క్రితం ప్రైవసీ రూల్స్ వల్ల వాట్సాప్ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యింది. వాట్సాప్ తమ ప్రైవసీని ప్రశ్నార్థకంగా మార్చేందుకు ప్రయత్నం చేస్తుందని చాలా మంది ఆరోపించారు. ఈ క్రమంలో కొందరు వాట్సాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ కూడా చేశారు. అయితే తప్పును గుర్తించిన వాట్సాప్ వెంటనే దానిని ఉపసంహరించుకుంది. ఇక అనంతరం తమ యూజర్లను మరింత పెంచుకునే పనిలో పడ్డ వాట్సాప్ రకరకల కొత్త ఫీచర్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది.
ఇందులో భాగంగా ఇటీవల కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తుంది వాట్సాప్. ఇప్పటికే వ్యూ వన్స్ పేరుతో ఫీచర్‌ను పరిచయం చేసింది వాట్సాప్. ఈ ఫీచర్ సహాయంతో మనం పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తి ఒకేసారి చూసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా వాట్సాప్ ‘డిస్‌అప్పియరీంగ్’ అనే మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. మనకు వచ్చే మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అయ్యే ఈ ఫీచర్‌ను వాట్సాప్ గతేడాది పరిచయం చేసింది. ఈ ఫీచర్ సహాయంతో ఏడు రోజుల పాటు మన మెసేజ్‌లు డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం 7 రోజులు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ వ్యవధిని వాట్సాప్ 90 రోజులకు పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంటే ఇకపై 90 రోజుల తర్వాత మన ఫోన్‌లోని మెసేజ్‌లు వాటంతట అవే డిలీట్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చన్నమాట.
ప్రస్తుతం ఈ ఫీచర్‌ను వాట్సాప్ బెటా వెర్షన్‌లో పరీక్షిస్తోంది. మరికొన్ని రోజుల్లో అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది. ఇదిలా ఉంటే వాట్సాప్ ఇటీవల ఐఓఎస్ నుంచి ఆండ్రాయిడ్‌లోకి చాట్‌ను ట్రాన్సఫర్ చేసుకునే వెసులుబాటును కల్పించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొంతమంది సెలక్ట్ యూజర్లకు పరీక్షిస్తోంది. వాట్సాప్ ఈ ఫీచర్‌ను తొలుగ శాంసంగ్ త్వరలో లాంచ్ చేయనున్న గ్యాలక్సీ జెడ్ ఫోల్డ్ 3, గ్యాలక్సీ జెడ్ ఫ్లిప్ 3లో ప్రవేశపెట్టనుంది.
Bigg Boss 5 Telugu : ఉత్కంఠకు తెరపడినట్టేనా..? బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్ళేది వీళ్ళేనా..?