AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. అది గానీ వస్తే..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌‌లో వాట్సాప్‌ను తలదన్నే షేరింగ్ యాప్ ఇప్పటివరకు రాలేదు. దాని క్రేజ్ అలాగే కొనసాగుతుంది. యూజర్స్‌ ఫ్రెండ్లీగా ఉండే వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సంస్ధ చేసిన కృషి ఫలించింది. డిజప్పీయరింగ్ మెసేజెస్ అనే కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా కలిగే ఉపయోగం చాలా బాగుంది. ఎవరైనా యూజర్ చాట్ చేసిన తర్వాత ఆ మెసేజ్ నిర్దేశించుకున్న టైమ్ వరకు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తుంది. […]

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. అది గానీ వస్తే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 04, 2019 | 4:27 PM

Share

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌‌లో వాట్సాప్‌ను తలదన్నే షేరింగ్ యాప్ ఇప్పటివరకు రాలేదు. దాని క్రేజ్ అలాగే కొనసాగుతుంది. యూజర్స్‌ ఫ్రెండ్లీగా ఉండే వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి సంస్ధ చేసిన కృషి ఫలించింది. డిజప్పీయరింగ్ మెసేజెస్ అనే కొత్త ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా కలిగే ఉపయోగం చాలా బాగుంది. ఎవరైనా యూజర్ చాట్ చేసిన తర్వాత ఆ మెసేజ్ నిర్దేశించుకున్న టైమ్ వరకు మాత్రమే స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ తర్వాత అది ఆటోమేటిక్ గా మాయమవుతుంది.

Whatsapp new feature disappearing message will not work for indian users

ప్రస్తుతం ఈ ఫీచర్ సెస్టింగ్ దశలో ఉంది. అయితే దీన్ని ఆండ్రాయిడ్ వర్షెన్ 2.19.275లో ఈ ఫీచర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆ తర్వాత ఇన్స్‌టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని పూర్తిగా డెవలప్ చేసిన తర్వాత డెవలపర్స్ టెస్ట్ చేస్తారు. ఈ సమయంలో ఎదైనా సమస్యలు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే వాటిని సరిచేస్తారు. అన్నీ కూలంకశంగా చూసిన తర్వాతే బయటకు విడుదల చేసే ఛాన్స్ ఉంది. ఆండ్రాయిడ్ వర్షెన్‌లో సక్సెస్ అయిన తర్వాత ఐఓఎస్ వర్షెన్‌లో కూడా డెవలప్ చేయనున్నట్టు వాట్సాప్ సంస్ధ పేర్కొంది.

Whatsapp new feature disappearing message will not work for indian users

లేటెస్ట్‌గా డెవలప్ చేస్తున్న డిజప్పియరింగ్ మెసేజ్ ఫీచర్‌లో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఇందులో రెంటికి రెండూ ప్రధానమైనవే. అవి ఒకటి ఆన్, ఆఫ్, రెండోది టైమ్ సెట్టింగ్. ఈ టైమ్ సెట్టింగ్‌లో 5 సెకెన్ల నుంచి ఒక గంట వరకు కనిపించేలా సెట్ చేసుకోవచ్చు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఒక్కసారి ఆ మెసేజ్ గనుక ఫోన్ స్క్రీన్ నుంచి కనిపించలేదంటే ఇక మళ్లీ కనిపించే ఛాన్స్ లేనట్టేనట. ప్రపంచమంతా దీన్ని రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. అయితే తాజాగా రూపొందిస్తున్న ఈ ఫీచర్ మన భారత్‌కు అంతగా ఉపయోగపడే ఛాన్స్ లేదనే వాదన వినిపిస్తోంది. దీనికి ఒక కారణముంది. ఇప్పటికే మన సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్నో కేసులను వాట్సాప్ ఛాటింగ్‌ను బట్టి.. అది ఎక్కడి నుంచి వచ్చిందో లొకేషన్ ఆధారంగా విచారిస్తున్నారు. ఈ విధంగా ఎన్నో నేరాల గుట్టును వెలికి తీశారు. ఇప్పుడు వాట్సాప్‌లో ఈ విధంగా డిజప్పీయరింగ్ మెసేజ్ ఆప్షన్ వస్తే.. భవిష్యత్తులో నేరస్తులను కనిపెట్టడం కష్టతరంగా మారే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఆప్షన్స్‌లో డిలీట్ ఎవ్రీవన్ అని ఆప్షన్ ఉంది. ఇందులో డిలీట్ చేసినా.. తిరిగి ఆ మెసేజ్‌ను పొందే అవకాశాలున్నాయి. వాట్సాప్ టెస్ట చేస్తున్న డిజప్పీయరింగ్ మెసేజ్ ఆప్షన్‌పై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. అది అందుబాటులోకి వస్తే తప్ప ఎంతవరకు ఉపయోగమో చెప్పడం కష్టమే.