Whatsapp: వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌.. ఇకపై పాత మెసేజ్‌లు వెతకడం మరింత సులువు.

|

Jan 27, 2023 | 9:31 AM

ప్రతీ ఒక్కరి స్మార్ట్‌ ఫోన్‌లో వాట్సాప్‌ కచ్చితంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతలా యూజర్లను ఆకట్టుకుందీ యాప్‌. మార్కెట్లో ఎన్నో రకాల మెసేజింగ్‌ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు...

Whatsapp: వాట్సాప్‌లో మరో అద్భుత ఫీచర్‌.. ఇకపై పాత మెసేజ్‌లు వెతకడం మరింత సులువు.
Whatsapp
Follow us on

ప్రతీ ఒక్కరి స్మార్ట్‌ ఫోన్‌లో వాట్సాప్‌ కచ్చితంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతలా యూజర్లను ఆకట్టుకుందీ యాప్‌. మార్కెట్లో ఎన్నో రకాల మెసేజింగ్‌ యాప్స్‌ అందుబాటులోకి వస్తున్నా వాట్సాప్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం వాట్సాప్‌ తీసుకొచ్చే ఫీచర్లే. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను పరియం చేస్తుంది కాబట్టే ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్‌. మరీ ముఖ్యంగా ఇటీవల మార్కెట్లో నిలదొక్కుకునే క్రమంలో వాట్సాప్‌ వరుసపెట్టి ఫీచర్లను పరియం చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను వాట్సాప్‌ పరిచయం చేసింది.

సాధారణంగా చాట్‌ బాక్స్‌లో పాత మెసేజ్‌లను వెతకడం కష్టమైన పనే అని చెప్పాలి. సెర్చ్‌ ఆప్షన్‌లో సదరు మెసేజ్‌ను టైప్‌ చేయడం ద్వారా పాత మెసేజ్‌లను తిరిగి పొందొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఇలా చేసినా రిజల్ట్‌ అంత సులభంగా రాదు. అయితే తాజాగా వాట్సాప్‌ ఇందుకోంస ‘సెర్చ్‌ బై డేట్‌’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని ద్వారా పాత మెసేజ్‌లను తేదీల వారీగా తిరిగి పొందవచ్చు. ఈ ఫీచర్ iOS స్మార్ట్‌ఫోన్‌లలో సరికొత్త 23.1.75 అప్‌డేట్‌తో అందుబాటులో ఉంది. మిగతా యూజర్లకు త్వరలో అందుబాటులోకి రానుంది.

ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవాలనుకునే వారు.. ముందుగా వాట్సాప్‌ చాట్‌లో సెర్చ్‌ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అనంతరం అక్కడ క్యాలెండర్‌ సింబల్‌ కనిపిస్తుంది. క్యాలెండర్‌లో మీకు కావాల్సిన తేదీ, నెల, సంవత్సరంను సెలక్ట్‌ చేసుకోవాలి. తర్వాత ఎంటర్‌ నొక్కితే వెంటనే ఆ రోజు మీకు వచ్చిన మెసేజ్‌లు స్క్రీన్‌పై డిస్‌ప్లే అవుతాయి. ఇలా మీకు వచ్చిన పాత మెసేజ్‌లను చాలా సింపుల్‌గా వెతుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..